అదృశ్యమైన సుఖోయ్ 30 శకలాలు లభ్యం: పైలట్ల సమాచారం లేదు
మూడు రోజుల క్రితం గల్లంతైన ‘సుఖోయ్-30’ యుద్ధవిమానం శకలాలను గుర్తించారు. చైనా సరిహద్దులోని అడవుల్లో సుఖోయ్ 30 శకలాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ల సమాచారం మాత్రం అందలేదు.
న్యూఢిల్లీ: మూడు రోజుల క్రితం గల్లంతైన 'సుఖోయ్-30' యుద్ధవిమానం శకలాలను గుర్తించారు. చైనా సరిహద్దులోని అడవుల్లో సుఖోయ్ 30 శకలాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ల సమాచారం మాత్రం అందలేదని తెలిపారు.

విమానం గల్లంతైన అసోంలోని తేజ్‌పూర్‌కు 60కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో సుఖోయ్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని చెప్పారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 గత మంగళవారం అసోంలో గల్లంతైన విషయం తెలిసిందే.
సాధారణ శిక్షణలో భాగంగా ఇద్దరు పైలట్లతో తేజ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన విమానం కాసేపటికి కన్పించకుండా పోయింది. మంగళవారం ఉదయం 11.10 గంటల సమయంలో విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications