కాంగ్రెస్ లో చేరబోతున్న వినేష్ ఫోగట్ ? రైతుల నిరసనకు మద్దతుతో అడుగులు..!
పారిస్ ఒలింపిక్స్ లో బరువు వివాదంతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. అంతకు ముందే తన స్వరాష్ట్రం హర్యానాకు చెందిన రైతులు చేస్తున్న ఆందోళనకు ఇవాళ మద్దతు తెలిపారు. శంభూ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు స్వయంగా వెళ్లి మద్దతు ప్రకటించిన వినేష్.. మీ కూతురు వచ్చేసిందంటూ సంతోషంగా తెలిపింది.
రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన వినేష్ ఫోగట్.. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చింది. శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న నిరసన 200వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఫోగట్ వారితో కలిసి సంఘీభావం తెలిపారు.ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు అధికారులు అడ్డుకోవడంతో రైతులు శంభు సరిహద్దు వద్ద బైఠాయించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఇతర కీలక అంశాలతోపాటు నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులు చాలా కాలంగా అక్కడే కూర్చుని, వారి హక్కుల కోసం పోరాడుతున్నా, వారి శక్తి, సంకల్పం తగ్గలేదని ఫోగట్ ప్రశంసించారు. రైతు కుటుంబంలో పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. నిరసనకారులకు తమ కూతురిలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.మన కోసం మరెవరూ రారు కాబట్టి మన హక్కుల కోసం మనం నిలబడాలన్నారు. మీ డిమాండ్లు నెరవేరాలని, మీ హక్కులను పొందకుండా తిరిగి రాకూడదని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్వరలో జరిగే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఫోగట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రైతులకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
#WATCH | Wrestler Vinesh Phogat arrives at the farmers' protest site at Shambhu border, as the agitation completes 200 days.
— ANI (@ANI) August 31, 2024
She says, "It has been 200 days since they are sitting here. It is painful to see this. All of them are citizens of this country. Farmers run the… pic.twitter.com/MJo9XEqpko












Click it and Unblock the Notifications