Haryana Elections 2024: పోటీలో నిలిచిన కుస్తీ యోధురాళ్లు వినేష్ ఫోగట్, కవితా దలాల్..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆకస్తికర పోరు జరిగే నియోజకవర్గాల్లో జులనా ఒకటి. జింద్ జిల్లాలోని జులనాలో ఇద్దరు మల్లయోధురాళ్లు తలపడనున్నారు. వీరిలో ఒకరు కవిత దలాల్ కాగా మరొకరు వినేష్ ఫోగట్. కవిత దలాల్ ఆప్ నుంచి పోటీ చేస్తుండగా.. వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. మొన్న పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ ఫైనల్ కు వెళ్లింది. కానీ అధిక బరువుతో ఆమెపై అనర్హత వేటు పడింది.
దీంతో ఆమె వంటి చేతులతో తిరుగుముఖం పట్టారు. అయితే వినేష్ ఫోగట్, కవిత దలాల్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వీరు.. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. వినేష్ ఫోగట్ కుస్తీని రాజకీయంగా వినియోగించుకుంటున్నట్లు కవిత దలాల్ ఆరోపించారు. జులనా నుంచి తను గెలుస్తానని ఆమె పేర్కొన్నారు.

వినేష్ ఫోగట్ ప్రచారం దూసుకెళ్తోంది. తను ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు వినేష్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. కవిత దలాల్, వినేష్ ఫోగట్ ఇద్దురు కూడా జులనా అసెంబ్లీలో ఆధిపత్య కులమైన జాట్ వర్గాలకు చెందినవారుగా ఉన్నారు. వినేష్ ఫోగట్ ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆమెకు జులనా నుంచి పార్టీ అవకాశం కల్పించింది.
90 అసెంబ్లీ సీట్లు ఉన్న హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు రానున్నాయి. హర్యానాలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్ దల్ మధ్య పోటీ ఉండనుంది.












Click it and Unblock the Notifications