Illegal affair: కారు డ్రైవర్ తో బిజినెస్ మ్యాన్ భార్య ఎస్కేప్, కోటీశ్వరుడిని వదిలేసి, వాడే కావాలి !

చెన్నై: వ్యాపారం చేస్తున్న కోటీశ్వరుడికి ఓయువతితో వివాహం అయ్యింది. ఫోర్ వీలర్ వాహనాల వ్యాపారం చేస్తున్న భర్త లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నారు. వ్యాపారి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తూ భర్త చాలా బిజీబిజీగా ఉంటున్నాడు. ఇంట్లో ఉంటున్న భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యాపారి భార్య కళ్లు మూసుకుపోయి అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియుడి వ్యామోహంలో పడిపోయిన భార్య ఇంట్లో ఉన్న లక్షల రూపాయల నగదుతో పాటు 80 పౌండ్ల బంగారం, భర్త విలాసవంతమైన కారుతో సహ బిడ్డను ఎత్తుకుని ప్రియుడితో పరారైయ్యింది. కొన్ని నెలలు పోలీసులకు, భర్తకు చిక్కకుండా అతని భార్య ప్రియుడితో ఎంజాయ్ చూస్తూ కాలం గడిపేసింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు వ్యాపారి భార్య, ఆమె ప్రియుడిని పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. అందరి ముందు భార్య చెప్పిన మాటలకు అతని భర్తతో పాటు పోలీసులు బిత్తరపోయారు.

 గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న కోటీశ్వరుడు

గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న కోటీశ్వరుడు

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కన్యాకుమారి జిల్లాలోని మార్తాండంలో మోహన్ రాజ్ (41) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కన్యాకుమారి జిల్లాలోనే మోహన్ రాజ్ ఫేమస్ ఫోర్ వీలర్ వాహనాల డీలర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. వాహనాల వ్యాపారం చేస్తున్న మోహన్ రాజ్ కు కొన్ని సంవత్సరాల క్రితం సోనియా గాంధీ అలియాస్ సోనియా (35) అనే యువతితో గ్రాండ్ గా వివాహం జరిగింది

 బయట బిజీగా ఉంటున్న భర్త

బయట బిజీగా ఉంటున్న భర్త

ఫోర్ వీలర్ వాహనాల వ్యాపారం చేస్తున్న మోహన్ రాజ్ లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నాడు. వ్యాపారి మోహన్ రాజ్, సోనియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తూ మోహన్ రాజ్ చాలా బిజీబిజీగా ఉంటున్నాడు. వ్యాపారం పనిమీద మోహన్ రాజ్ ఎక్కువగా బయటతిరుగుతున్నాడు.

 కామంతో రగిలిపోయిన భార్య

కామంతో రగిలిపోయిన భార్య

ప్రతిరోజూ ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకుంటున్న మోహన్ రాజ్ భార్య సోనియాకు సెల్వరాజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సెల్వరాజ్, సోనియాల పరిచయం త్వరగానే అక్రమ సంబంధానికి దారితీసింది. సెల్వరాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న మోహన్ రాజ్ భార్య సోనియా కళ్లు మూసుకుపోయి కామంతో అతనితో ఆమె ఇంటిలోనే ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

 రూ. లక్షల విలువైన నగలు, డబ్బులతో జంప్

రూ. లక్షల విలువైన నగలు, డబ్బులతో జంప్

ప్రియుడు సెల్వరాజ్ వ్యామోహంలో పడిపోయిన సోనియా అతనితో లేచిపోయి ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. ఇదే ఏడాది ఆగస్టు 19వ తేదీన భర్త మోహన్ రాజ్ వ్యాపారం పని మీద బయట ఊరికి వెళ్లాడు. అదే రోజు మోహన్ రాజ్ భార్య సోనియా ఇంట్లో ఉన్న లక్షల రూపాయల నగదుతో పాటు 80 పౌండ్ల బంగారం, భర్త విలాసవంతమైన కారుతో సహ బిడ్డను ఎత్తుకుని ప్రియుడితో పరారైయ్యింది.

 మొగుడి మైండ్ బ్లాక్

మొగుడి మైండ్ బ్లాక్

భార్య సోనియా ప్రియుడితో లేచిపోయిన రోజు రాత్రి ఇంటికి వెళ్లిన మోహన్ రాజ్ అతని రెండో బిడ్డతో పాటు భార్య సోనియా కనపడకపోవడంతో ఆందోళన చెందాడు. ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో నగదు, నగలు కూడా కనపడకపోవడంతో మోహన్ రాజ్ హడలిపోయాడు. ఇంటి ముందు ఉన్న కారు కనపడకపోవడంతో మోహన్ రాజ్ ఆందోళన చెంది నా భార్య సోనియా, నా బిడ్డ కనపడటం లేదని మార్తాండం పోలీసులను ఆశ్రయించాడు.

 పోలీసులు చేతులు ఎత్తేశారు..... భర్తను కోర్టు ఆదుకుంది

పోలీసులు చేతులు ఎత్తేశారు..... భర్తను కోర్టు ఆదుకుంది

పోలీసులు సోనియా మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. సోనియా ఓ యువకుడితో కలిసి కేరళలోని లాడ్జ్ లో ఉందని మార్తాండం పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు కేరళ వెళ్లే సమయానాకి సోనియా, ఆమె ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. తరువాత తమిళనాడు పోలీసులు సోనియా కనపడటం లేదని మోహన్ రాజ్ కు చేతులు ఎత్తేశారు. మోహన్ రాజ్ చివరికి తన భార్య, బిడ్డ కనపడటం లేదని మదురై హైకోర్టు బెంచ్ లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. నెల రోజుల్లో మోహన్ రాజ్ భార్య, అతని బిడ్డను కోర్టులో హాజరుపరచాలని మదురై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 ప్రియుడి మైకంలో ఉన్న భార్య చిక్కిపోయింది

ప్రియుడి మైకంలో ఉన్న భార్య చిక్కిపోయింది

కోర్టు ఆదేశాలతో పోలీసులు సోనియా కోసం ముమ్మరంగా గాలించారు. సోనియా ఆమె ప్రియుడు ఢిల్లీలో ఉన్నారని పోలీసులకు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ వెళ్లిన కన్యాకుమారి పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో సోనియా, ఆమె ప్రియుడిని, బిడ్డను పట్టుకుని తమిళనాడు తీసుకు వచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు,

 ప్రియుడి మోజులో భర్తను ఛీ కొట్టిన భార్య

ప్రియుడి మోజులో భర్తను ఛీ కొట్టిన భార్య

సోనియాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఆమె దగ్గర ఉన్న 45 పౌండ్ల బంగారు నగలు, విలాసవంతమైన కారుతో పాటు నగదు సీజ్ చేసి కోర్టు ముందు సమర్పించారు. మోహన్ రాజ్, అతని పెద్ద కొడుకు కోర్టు ముందు హాజరైనారు. ఆ సమయంలో నేను నా భర్త మోహన్ రాజ్ తో కలిసి జీవించలేనని, నేను నా ప్రియుడితో ఉంటానని సోనియా చెప్పింది. తనతో కలిసి జీవించాలని మోహన్ రాజ్ అతని భార్య సోనియాను వేడుకున్నాడు. నేను నా ప్రియుడితోనే ఉంటానని సోనియా పట్టుబట్టింది. అయితే సోనియా ప్రియుడితో వెళ్లిపోయి అతనితోనే ఇంకా జీవిస్తోంది. కన్యాకుమారిలో జరిగిన ఈ సంఘటన 2021లో తమిళనాడులో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+