Wife: భార్యకు బలుపు ఎక్కువ, భర్తకు గుడ్ బాయ్ చెప్పి ప్రియుడితో చెక్కేసింది, ఏదో చెయ్యాలని, చివరికి !
కన్యాకుమారి/ చెన్నై: అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు చెప్పడంతో ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. ఎంత త్వరగా పెళ్లి జరిగింతే అంత మంచిది అంటూ ఆ యువకుడు ఆవేశంతో వెనుకా ముందు ఆలోచించకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త, పిల్లలతో కలసి సంతోషంగా ఉంటున్న బార్య జీవితంలోకి ఓ కేటుగాడు ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్త, పిల్లల గురించి పట్టించుకోవడం మానేసింది. ఎర్రగా, బుర్రగా ఉన్నానే బలుపుతో భార్య ప్రియుడి ద్యాసలో పడిపోయి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. మంచి రోజు చూసిన భార్య ప్రియుడితో కలిసి చెక్కేసింది. ప్రియుడితో పారిపోయిన మహిళ మరోసారి గర్బవతి అయ్యింది. ఇదే సమయంలో పోలీసులు ఆమె కోసం కోసం గాలించారు. వివాహేతర సంబంధం పెట్టుకుని తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరి అడ్రెస్ తెలుసుకుని వెళ్లిన పోలీసులు అక్కడి సీన్ చూసి హడలిపోయారు.

అందంగా ఉన్నానని భార్యకు టెక్కు ఎక్కువ
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ లోని శంకన్ పుత్తూర్ ప్రాంతంలో సుభాష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు, విద్యా అనే యువతిని చూసి పెళ్లి చేసుకోవాలని సుభాష్ కు చెప్పారు. వెనుకాముందు ఆలోచించకుండా సుభాష్ విద్యాను వివాహం చేసుకున్నాడు. సుభాష్ విద్యా దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. విద్యా చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆమెకు టెక్కు, బలుపు ఎక్కువ అని ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలోని చుట్టుపక్కలవాళ్లు అంటున్నారు.

ఒకే చోట ఉద్యోగాలు...... లైన్ లోకి వచ్చిన కుర్రాడు
కన్యాకుమారి జిల్లాలోని థెరూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సురేష్ కుమార్ (25) అనే యువకుడు నాగర్ కోవిల్ లోని పంచాయితీ ఆఫీసులో ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదే థెరూర్ పంచాయితీలో విద్యా కూడా ఉద్యోగం చేస్తున్నది. ఒకేచోట ఉద్యోగం చేస్తున్న సురేష్ కుమార్ కు, విద్యాకు పరిచయం అయ్యింది. విద్యా చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉండటంతో సురేష్ కుమార్ ఆమెకు లైన్ వేశాడు.

ప్రియుడి మీద మోజు ఎక్కువ అయ్యింది
విద్యా, సురేష్ కుమార్ రోజూ గంటలు గంటలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కొంతకాలానికి సురేష్ కుమార్ వలలో పడిపోయిన విధ్యా అతని మోజులో పడిపోయింది. తాను ఇద్దరు పిల్లలకు తల్లి అనే విషయం మరిచిపోయిన విధ్యా ఆమె ప్రియుడు సురేష్ కుమార్ తో కలిసి ఎక్కడికంటే అక్కడికి వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడి మోజులో పడిపోయిన విధ్యా ఆమె భర్త సుభాష్ ను, ఇద్దరు పిల్లల విషయం మరిచిపోయి బయట తిరుగుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్లింది.

భర్తను చీపురు పుల్లతో చూసిన భార్య
సురేష్ కుమార్, విధ్యా అక్రమ సంబంధం గురించి స్థానికంగా నివాసం ఉంటున్న చాలా మందికి తెలిసిపోయింది. భార్య విధ్యాకు బుద్దిమాటలు చెప్పడానికి ఆమె భర్త సుభాష్ అనేకసార్లు ప్రయత్నించాడు. ప్రియుడు సురేష్ కుమార్ మోజులో పడిన విధ్యా తనకు ఉద్యోగం ఉందనే ధీమాతో భర్త సుభాష్ ను, బంధువులను, బుద్దిమాటలు చెప్పిన స్నేహితులను ఏమాత్రం లెక్కచెయ్యకుండా వారిని చీపురు పుల్లతో సమానంగా చూసింది.

ప్రియుడికి వేరే అమ్మాయి ఆలోచన రాకూడదని ?
అందరికి మన విషయం తెలిసిపోయింది, ఇక ఏం జరిగితే అది జరగని అంటూ విధ్యా ఆమె ప్రియుడు సురేష్ కుమార్ తో ఇంకా ఎక్కువగా తిరుగుతు రెచ్యిపోయింది. ఇదే సమయంలో ప్రియుడు సురేష్ కుమార్ కు అతని కుటుంబ సభ్యులు చివాట్లు పెట్టి అతనికి వేరే అమ్మాయితో పెళ్లి చేసి దారిలో పెట్టడానికి పెళ్లి సంబంధాలు చూశారు. ప్రియుడు సురేష్ కుమార్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న విధ్యా అతనికి మరింత దగ్గర అయ్యి వేరే అమ్మాయి ఆలోచనరాకుండా సురేష్ కుమార్ కు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడఖ సుఖం ఇవ్వడం మొదలు పెట్టింది.

రివర్స్ లో లేపుకుపోయిన ప్రియురాలు
సురేష్ కుమార్ కు ఎక్కువగా పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇక లాభం లేదని మంచి రోజు చూసిన విధ్యా ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత అటునుంచి అటే ప్రియుడు సురేష్ కుమార్ తో కలిసిపారిపోయింది. చాలా రోజులు భార్య విధ్యా కోసం వెతికిన భర్త సుభాష్ చివరికి పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు విధ్యా, ఆమె ప్రియుడు సురేష్ కుమార్ కోసం గాలించారు.

ప్రియుడితో మూడోసారి గర్బవతి
ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న విధ్యా తరువాత ప్రియుడు సురేష్ కుమార్ తో కాపురం చేసి గర్బవతి అయ్యింది. సురేష్ కుమార్, విధ్యా కూడంకుళంలోని అద్దె ఇంటిలో కాపురం పెట్టారని పోలీసులకు తెలిసింది. పోలీసులు కూడంకుళంలో వారి కోసం వెతకడం మొదలుపెట్టారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న విధ్యా ఆమె ప్రియుడు సురేష్ కుమార్ కలిసి విషం సేవించారు.

వ్యామోహంలో పడి ఆత్మహత్య చేసుకున్నారు
పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే సురేష్ కుమార్, అతని ప్రియురాలు విధ్యా విషం తాగేసి స్పృహకోల్పోయిన విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మరుసటి రోజు సురేష్ కుమార్ మరణించాడు. మృత్యువుతో పోరాడిన విధ్యా వారం రోజుల తరువాత రాత్రి మృతి చెందిందని పోలీసులు అన్నారు. ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య విధ్యా శవాన్ని తీసుకోవడానికి ఆమె భర్త అంగీకరించలేదు. పోలీసులకు భయపడి వివాహేతర సంబంధం కొనసాగించిన నకిలీ ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో అప్పట్లో కన్యాకుమారిలో కలకలం రేపింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications