year ender 2023: heart attack మరణాలు, గుండె ఆరోగ్యం గుర్తు చేసిన ఏడాది

2023 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోనే గాక, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది గుండెపోటు మరణాలు పెరిగాయి. గుండెపోటు అనేది సాధారణ వ్యక్తుల్లోనే కాకుండా చాలా మంది ప్రముఖ వ్యక్తుల మరణానికి కూడా కారణమైంది. అటువంటి పరిస్థితిలో, గుండెపోటు కేసులు క్రమంగా ఎందుకు పెరుగుతున్నాయి అనే ప్రశ్న తలెత్తుతోంది? దీనికి కారణం ఏమిటి, మనల్ని, మన ప్రియమైనవారి హృదయాలను రక్షించుకోవడంలో మనం ముఖ్యమైన పాత్రను ఎలా పోషిస్తాం అనేది కీలక అంశంగా మారింది.

కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఏదైనా సమస్య తీవ్రంగా ఉంటే.. అది గుండె సంబంధిత వ్యాధికి దారితీస్తోంది. ఒక దశాబ్దం క్రితం వరకు, గుండె సంబంధిత వ్యాధులు వృద్ధాప్య సమస్యలతో ముడిపడి ఉండేవి. కానీ, ఇప్పుడు గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. వృద్ధుల్లోనే కాకుండా యువకుల్లో కూడా గుండెపోటు కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ ఏడాదిలో గుండెపోటుతో మరణించిన వారిలో యువకులు ఎక్కువగా ఉండటం శోచనీయ అంశంగా మారింది.

year ender 2023: heart attack death cases increased this year; know how to save your heart

2023 ముగియబోతోన్న పరిస్థితిలో.. గుండెపోటు కేసులు పెరగడానికి కారణాలు ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం గుండెపోటు కేసులను పరిశీలించి, వాటి నుంచి కొంత నేర్చుకోవాల్సి ఉంది. తద్వారా భవిష్యత్తులో ఈ సమస్యలు తగ్గుతాయి. 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా గుండెపోటు కేసులు కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 ఏళ్ల కుర్రాడికి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటు మరణించాడు.

మరో ఘటనలో 26 ఏళ్ల కుర్రాడు జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఉదంతాలు ఈ ఏడాది చాలానే కనిపించాయి. సోషల్ మీడియాలోనూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
గుండెపై కరోనా చాలా చెడు ప్రభావాన్ని చూపిందని ఆరోగ్య నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. దీనితో పాటు, అనారోగ్యపు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు కేసులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. సురక్షితమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు తగిన వ్యాయామం, నిద్ర అవసరమని పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+