వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేడీఎస్ విప్‌కు విలువలేదు.. కుమార స్వామి సర్కారుకు రేపే ఆఖరి రోజు..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్నాటక రాజకీయానికి రేపటితో ఫుల్ స్టాప్ పడే అకాశముంది. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం కూడా కొనసాగనుంది. గత రెండు రోజులుగా సాగన చర్చ సోమవారం ముగిసి ఓటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుండడంతో స్పీకర్ సభను వాయిదా వేస్తూ వస్తున్నారు.

కర్నాటకలో తాజా పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపించారు. రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా జేడీఎస్ విప్ జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ పార్టీ జారీ చేసిన విప్‌కు విలువలేదని యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు.

Yeddyurappa says Monday will be last day for Kumaraswamy govt

గవర్నర్ వాజుభాయ్ మాటల్ని సైతం స్పీకర్, ముఖ్యమంత్రి లెక్క చేయడం లేదని యడ్యూరప్ప మండి పడ్డారు. స్పీకర్ రమేష్ కుమార్, సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సోమవారం అవిశ్వాసంపై ఓటింగ్‌కు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. సోమవారం కుమారస్వామి ప్రభుత్వానికి చివరి రోజని యడ్యూరప్ప జోస్యం చెప్పారు.

English summary
political crisis in Karnataka has dragged beyond with the Governor, Vajubhai Vala, setting another deadline for trust vote on Friday as the Kumaraswamy government demanded to finish debate while BS Yeddyurappa-led BJP asked for an immediate floor test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X