బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YES Bank: రూ. 712 కోట్లకు కుచ్చుటోపి, రియల్ ఎస్టేట్ కంపెనీ మీద చీటింగ్ కేసు, ఐటీ హబ్ లో హడల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ముంబాయి/న్యూఢిల్లీ: ప్రముఖ ఎస్ బ్యాంకుకు ఏకంగా రూ. 712 కోట్లు కుచ్చుటోపీ పెట్టారని ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఐటీ హబ్ లోని ఆ బ్యాంకు ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకులో రుణం తీసుకున్న మేధావులు కరోనా వైరస్ కారణంగా మా వ్యాపారం అటకెక్కిందని, EMIలు ఇప్పట్లో కట్టలేమని బ్యాంకు యాజమాన్యంకు తేల్చి చెప్పారు. మొడిబకాయిలు వసూలు చెయ్యడానికి ఇంతకాలం నానా తంటాలు పడిన YES బ్యాంకు యాజమాన్యం విధిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించండంతో బడా రియల్ ఎస్టేట్ కంపెనీ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకాలం బెంగళూరు, ముంబాయిలో వారి స్థోమతనుబట్టి బ్యాంకులో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు విషయం తెలుసుకుని ఆందోళనకు గురౌతున్నారని సమాచారం.

Illegal affair: ప్రియురాలిని లేపేశాడు, నీ పెళ్లాన్ని చంపేశానని భర్తకు ఫోన్, ఏం జరిగిందంటే ?Illegal affair: ప్రియురాలిని లేపేశాడు, నీ పెళ్లాన్ని చంపేశానని భర్తకు ఫోన్, ఏం జరిగిందంటే ?

 బడా రియల్ ఎస్టేట్ కంపెనీ

బడా రియల్ ఎస్టేట్ కంపెనీ

ఐటీ హబ్ దేశ రాజధాని బెంగళూరులోని ఎంజీ రోడ్డులో నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయం ఉంది. నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం బెంగళూరు, ముంబాయిలోని YES Bankలో ఆర్థిక లావాదేవీల కోసం అకౌంట్ లు ప్రారంభించారు. కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించిన నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం బ్యాంకు అధికారుల దగ్గర గుడ్ విల్ సంపాధించిందని సమాచారం.

 జస్ట్ రూ. 712 కోట్లు అంతే !

జస్ట్ రూ. 712 కోట్లు అంతే !

బెంగళూరులో హైడా పార్క్, కోలంబస్ స్టేవర్, మైట్టోర్న్ పార్క్, నితీశ్ ప్లాజా, నితీశ్ సాహో, ధణిసంద్ర ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం YES బ్యాంకులో 2016వ సంవత్సరంలో ఏకంగా రూ. 712 కోట్ల రుణం తీసుకున్నారు. నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీని గుడ్డిగా నమ్మిన ఎస్ బ్యాంకు యాజమాన్యం వారు అడిగిన మొత్తం రుణం ఇచ్చేశారని సమాచారం.

 కరోనా కాలంలో EMIలు కట్టడం ఎలా సాధ్యం చెప్పండి ?

కరోనా కాలంలో EMIలు కట్టడం ఎలా సాధ్యం చెప్పండి ?

ఎస్ బ్యాంకులో రుణం తీసుకున్న నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం 2016 నుంచి 2019 వరకు సక్రమంగా బ్యాంకు ఈఎంఐలు చెల్లించారు. 2019 నుంచి ఇప్పటి వరకు నితీశ్ యాజమాన్యం ఈఎమ్ఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది వారిని ప్రశ్నించారు. కరోనా వైరస్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, ఇలాంటి సమయంలో ఈఎమ్ఐలు ఎలా చెల్లిస్తాము చెప్పండి అంటూ నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహకులు చేతులు ఎత్తేశారని సమాచారం.

 11 మంది మీద ఎఫ్ఐఆర్

11 మంది మీద ఎఫ్ఐఆర్

నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం రూ. 712 కోట్లకు ఈఎమ్ఐలు కట్టకుండా టార్చర్ పెట్టడంతో ఎస్ బ్యాంకు యాజమాన్యం హడలిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఎస్ బ్యాంకు ముంబాయి బ్రాంచ్ అధికారి ఆశీష్ జోషి కేసు పెట్టారు. నితీశ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన లాల్ గుడి సప్తరిషి, కుమార్ నెల్లూరు, సుబ్రమణియన్, ప్రదీప్, నారాయణన్, మహేష్ భూపతి, చంద్రశేఖర్ తో పాటు మొత్తం 11 మంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కబ్బన్ పార్క్ పోలీసులు కేసు విచారణ మొదలు పెట్టారు.

 దేవుడా....... మా డబ్బులు కాపాడు స్వామి

దేవుడా....... మా డబ్బులు కాపాడు స్వామి

ఎస్ బ్యాంకుకు రూ. 712 కోట్లు మోసం చేశారని వెలుగు చూడటంతో ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన మహానుభావులు దేశం విడిచి విదేశాలకు పారిపోవడంతో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ చిటింగ్ కేసు వెలుగు చూడటంతో బ్యాంకు ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు. దేవుడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు కాపాడు స్వామి అంటూ బెంగళూరులోని ఖాతాదారులు దేవుడికి వేడుకుంటున్నారు.

English summary
YES Bank: FIR has been filed against 11 in Cubbon Park police station bengaluru over Rs 712 crore fraud to yes bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X