Yogi Adityanath: ఐదు రికార్డు బద్దలుకొట్టిన యోగి, అలా తొలి ముఖ్యమంత్రిగా

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రెండో సారి అధికారంలోకి వస్తోంది. గురువారంనాడు విడుదలైన ఫలితాల్లో మెజార్టీకి అవసరమైన స్థానాలకంటే ఎక్కువగానే బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. అంతేగాక, తొలిసారి గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా, ఈ సందర్భంగా పలు రికార్డులు బద్దలయ్యాయి.

యూపీ మూడో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

యూపీ మూడో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

ఆ వివరాల్లోకి వెళితే.. గత 70 ఏళ్లలో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూసింది. ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే ఐదేళ్ల పూర్తికాలం పాలించారు. వీరిలో మొదటి వ్యక్తి 2007-12 వరకు మాయావతి(బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ), రెండోవారు 2012-17 వరకు అఖిలేష్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ) కాగా, మూడో వ్యక్తి యోగి ఆదిత్యనాథ్.

తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

కాగా, గత 15ఏళ్లలో తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలవనున్నారు. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ కూడా ఎమ్మెల్సీలుగానే ముఖ్యమంత్రి పదవులను చేపట్టారు. యోగి తొలి విడత కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచిన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగనున్నారు.

37ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా యోగి

37ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా యోగి

ఇక, 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలవనున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్డీ తివారి అవిభాజ్య ఉత్తరప్రదేశ్ లో 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ కూడా అధికారం నిలబెట్టుకోకపోవడం గమనార్హం. ఇప్పుడు యోగినే ఆ 37 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు.

‘నోయిడా' మూఢనమ్మకమేనని తేల్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్

‘నోయిడా' మూఢనమ్మకమేనని తేల్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్

ఇదిఇలావుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పెద్ద పారిశ్రామిక నగరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు అనుబంధ నగరంగా కొనసాగుతోంది. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోకి వస్తుంది. అయితే, ఈ నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఎవరూ కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేదని ఓ ప్రచారం ఉంది.

1980ల్లో వీరభద్ర సింగ్, ఎన్డీ తివారీలు ఈ నగరాన్ని సందర్శించాక పదవులు కోల్పోయారు. ఈ ప్రచారంతోనే అఖిలేష్ యాదవ్ ఈ నగరాన్ని తన పదవీకాలంలో సందర్శించలేదు. కానీ, యోగి ఆదిత్యనాథ్ మాత్రం 2018లో నోయిడాలో పర్యటించారు. దీనిపై అఖిలేష్ స్పందిస్తూ భవిష్యత్తుల్లో దీని ప్రభావం చూస్తారంటూ ఎద్దేవా చేశారు. కానీ, తాజా ఎన్నికల్లో యోగి నేతృత్వంలోని బీజేపీ తిరిగి అధికారం చేపడుతుండటం గమనార్హం.

దీంతో నోయిడా సందర్శన అనేది మూఢనమ్మకమేనని యోగి ఆదిత్యనాథ్ తేల్చేసినట్లయింది. గురువారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 270కిపైగా సీట్లు, ఎస్పీకి 120కిపైగా సీట్లు గెలుచుకునే దిశగా సాగుతున్నాయి.

తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి రికార్డు

తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి రికార్డు

మళ్లీ అధికారంలోకి వచ్చిన తొలి బీజేపీ సీఎం యోగి అవుతారు. ఆయన కంటే ముందు రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా బీజేపీ సీఎంలుగా ఉన్నారు. వీరిలో ఎవరూ రెండోసారి తమ పదవిని కొనసాగించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+