స్పోర్ట్స్ హబ్ గా యూపీ- త్వరలో 30 వేల గ్రౌండ్లు, స్టేడియాలు-యోగీ ఆదిత్యనాథ్ కీలక ప్రకటన
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఆరో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాది పాలన పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా భారీగా వేడుకలు నిర్వహిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ప్రజలకు వరుసగా వరాలు కూడా ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో భారీ ప్రకటన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో వచ్చే ఏడాది కల్లా కొత్తగా 30 వేల క్రీడా మైదానాల్ని నిర్మిస్తామని తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. అలాగే ప్రతీ పంచాయతీకి స్పోర్ట్స్ కిట్లు అందిస్తామని కూడా ప్రకటించారు. తద్వారా రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే ప్రతీ పంచాయతీలోనూ పురుషులు, మహిళలకు ప్రత్యేక జిమ్ లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ జిల్లాలో స్టేడియాలు, బ్లాకుల్లో మినీ స్టేడియాలు కూడా నిర్మిస్తామని ప్రకటించారు.

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో యూపీ ఎక్కువ పతకాలు సాధించే విధంగా ఇకపై ప్రణాళికలు రచిస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications