ఢిల్లీ NCR తరహాలోనే యూపీలో SCR ఏర్పాటు- సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు..
లక్నో : వరుసగా రెండోసారి యూపీలో అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఈసారి విన్నూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా సీఎం యోగీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో జాతీయ రాజధాని ప్రాంతం ఎస్సీఆర్ తరహాలోనే యూపీలో రాష్ట్ర రాజధాని ప్రాంతం ఎస్సీఆర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఢిల్లీ ఎన్సీఆర్ తరహాలోనే యూపీలో ఎస్సీఆర్ ఏర్పాటు కోసం రెండు వారాల్లో ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు. తాజాగా రాష్ట్రంలో అయోధ్య, వారణాసి ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా యోగీ ఈ ఆదేశాలు ఇచ్చారు.
ప్రతిపాదిత ఎస్సీఆర్ లక్నో, పరిసర జిల్లాలను కలుపుతూ లక్నో రాజధానిగా పరిసర ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి లక్నో యొక్క సామర్థ్యాన్ని విస్తరించే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. లక్నో మెట్రోపాలిటన్ సిటీ రూపంలో అత్యాధునిక పట్టణ సౌకర్యాలతో అభివృద్ధి చెందుతోందని, వివిధ నగరాల నుండి ప్రజలు ఇక్కడకు వచ్చి తమ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న లక్నోలో ప్రణాళిక లేని అభివృద్ధిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో జనాభా ఒత్తిడి కూడా పెరుగుతోంది. దీంతో సమన్వయ అభివృద్ధి కోణం నుండి ఎస్సీఆర్ ఏర్పాటు పనికొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క పెట్టుబడిదారును సంప్రదించి, వారి అవసరాలు, అంచనాలను తెలుసుకోవాలని, కొత్త పాలసీలు, విధానాల ప్రయోజనాలను వారికి అందించాలని సీఎం యోగీ అధికారుల్ని కోరారు.












Click it and Unblock the Notifications