యోగీ సరికొత్త రికార్డు- 10900 ఎన్ కౌంటర్లలో 183 మంది మట్టు- 233300 అరెస్టులు..
ఉత్తర్ ప్రదేశ్ లో ఓవైపు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణకూ కొన్నేళ్లుగా అంతే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్, మాఫియా అన్న పేరు వినిపించకుండా వారిని మట్టుబెట్టేస్తోంది. ఇందుకోసం సీఎం యోగీ ఆదిత్యనాథ్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో వారు క్రిమినల్ ఫ్రీ యూపీ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
యూపీలో యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఈ ఆరేళ్లలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంగా క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్ అన్న పేరు వినపడకుండా వారిని మట్టుబెట్టే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా జరిగిన అసద్ అహ్మద్, గులాంతో కలిపి 183 మంది నేరస్తుల్ని వారు మట్టుపెట్టేశారు. అలాగే 23300 మందిని వివిధ నేరాల్లో అరెస్టులు చేసి జైళ్లకు పంపారు. దీంతో ఇప్పుడు క్రిమినల్స్ అరాచకాలు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో 13 మంది పోలీసులు కూడా వీరమరణం పొందారు.
2017 మార్చిలో ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో 10,900కు పైగా పోలీసు ఎన్‌కౌంటర్‌లు జరిగాయని యూపీ పోలీసుల డేటా వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్లలో 23,300 మంది నేరస్థులు అరెస్టయ్యారు.
అలాగే 5,046 మంది గాయపడ్డారు. వీరిలో గాయపడిన పోలీసుల సంఖ్య 1,443 కాగా, 13 మంది మరణించినట్లు సమాచారం. మార్చి 2017 నుండి ఎన్‌కౌంటర్‌లలో మరణించిన 13 మంది పోలీసులలో.. 8 మంది కాన్పూర్‌లోని ఇరుకైన సందులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులు మెరుపుదాడికి పాల్పడ్డగా చనిపోయారు.












Click it and Unblock the Notifications