యోగీ మరో సంచలన నిర్ణయం-అయోధ్యలో మద్యం, మాంసం శాశ్వత బంద్...

యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య పవిత్రతను కాపాడేందుకు వీలుగా యోగీ ఆదిత్యనాథ్ ఇకపై అక్కడ మద్యం, మాంసం వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు యోగీ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ధర్మనగరి అయోధ్యలో మాంసాహారం, మద్యం సేవించడం నిషేధించాలని నిర్ణయించినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో తెలిపారు. రెండు రోజుల అయోధ్య పర్యటనలో భాగంగా ఇవాళ బికాపూర్ ప్రాంతంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు.

yogi adityanath regime ban consumption of liquour and meat in ayodhya

నిన్న జరిగిన సమావేశంలో సీఎం యోగీ.. అయోధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తుచేశారు. అలాగే అయోధ్య "ధర్మనాగ్రి" (మతపరమైన నగరం) కాబట్టి ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఇందులో భాగంగా నగరంలో మాంసం, మద్యం వినియోగాన్ని నిషేధించాలని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ''సీఎం అభిప్రాయం న్యాయమైనదే. అయోధ్య ఒక మతపరమైన నగరం, భవిష్యత్తులో ఇది ఆధ్యాత్మిక రాజధాని కానుందని, ఇక్కడ మద్యం, మాంసం నిషేధించాలని సూచించారు.

తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ అయోధ్యలో కొనసాగుతున్న రామ మందిర నిర్మాణాన్ని పరిశీలించారు. అయోధ్యను పట్టణాభివృద్ధికి నమూనా నగరంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు అయోధ్యకు చేరుకున్న తరువాత.. సిఎం యోగీ మొదట హనుమాన్‌గర్హి ఆలయంలో ప్రార్థనలు చేసి రామ్ లల్లాను దర్శనం చేసుకున్నారు. 'ఆరతి' మరియు 'పరిక్రమ'లో కూడా పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని సీఎం సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+