ఎక్స్ ప్రెస్ వే ప్రదేశ్ గా యూపీ- యోగీ కీలక ఆదేశాలు-వచ్చే ఏడాదికి గంగా ఎక్స్ ప్రెస్ వే పూర్తి..
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధిని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఇదే క్రమంలో గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. యూపీ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ వేను ఎట్టి పరిస్దితుల్లో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు తాజాగా యోగీ డెడ్ లైన్ పెట్టేశారు. దీంతో అధికారులు శరవేగంగా దీన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో.. నిర్మాణంలో ఉన్న, కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ అభివృద్ధిపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా కీలకమైన గంగా ఎక్స్‌ప్రెస్ వేను డిసెంబర్ 2024 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు, గంగా ఎక్స్‌ప్రెస్‌వే వెంట పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీనికి కూడా స్థలం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో గత ఐదున్నరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు మౌలిక సదుపాయాల రంగంలో ఎన్నో పనులు చేపట్టామని, 2017 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 2 ఎక్స్‌ప్రెస్‌వేలు మాత్రమే ఉన్నాయి, నేడు 6 ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయని యోగీ ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. 5 సంవత్సరాల క్రితంతో పోలిస్తే జాతీయ రహదారులు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయని తెలిపారు. సరిహద్దు ప్రాంత కనెక్టివిటీలో ఆశించిన మెరుగుదల ఉందన్నారు. అభివృద్ధిని వేగవంతం చేయడానికి మెరుగైన కనెక్టివిటీ అత్యంత ముఖ్యమైన మాధ్యమని యోగీ అభిప్రాయపడ్డారు.
నవ భారతదేశంలో నవ ఉత్తరప్రదేశ్‌కు 'ఎక్స్‌ప్రెస్ ప్రదేశ్'గా కొత్త గుర్తింపు వస్తోందని యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఇప్పటికే జాతికి అంకితం చేశామని, ఇప్పుడు గంగా ఎక్స్‌ప్రెస్‌వే, గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నట్లు యోగీ తెలిపారు. బుందేల్‌ఖండ్‌కు లైఫ్‌లైన్‌గా మారుతున్న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ఝాన్సీ, చిత్రకూట్‌లతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని సీఎం యోగి అన్నారు.చిత్రకూట్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే, ఝాన్సీ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేలకు కూడా బడ్జెట్ కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications