రాహుల్ గాంధీ అనర్హతవేటుపై యోగీ రియాక్షన్-కాంగ్రెస్ పార్టీపై తీవ్రవిమర్శలు..
కాంగ్రెస్ పార్టీ దేశంలో దళిత, పేద, బడుగు, బలహీన వర్గాల వారు అత్యున్నత స్ధానాలకు వెళ్తుంటే ఓర్వలేకపోతోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మోడీపై విమర్శల వివాదంలో రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురైన నేపథ్యంలో దీనిపై స్పందించిన యోగీ .. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యూపీలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన యోగీ..కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ దేశాన్ని విభజించే రాజకీయాలు చేస్తుందని, దాని రాజకీయ ప్రయోజనాల కోసం నక్సలిజం, ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తోందని అన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దళితులు, పేదలు, వెనుకబడిన వర్గాల వారికి వ్యతిరేకంగా ఎలా వ్యాఖ్యలు చేశారో దేశం చూసిందని యోగీ గుర్తుచేశారు. పార్లమెంటరీ సంప్రదాయాల్ని గాలికి వదిలి కోర్టు ధిక్కార స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందంటూ యోగీ విమర్శించారు.

యూపీలో రూ.1,780 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన అనంతరం సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజలను అవమానించినందుకు దేశానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని యోగీ కోరారు.
ప్రపంచంలోని 20 అత్యంత శక్తివంతమైన దేశాల సమూహం అయిన G20కి భారతదేశం ఇప్పుడు అధ్యక్షత వహిస్తోందని, ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావానికి నిదర్శనమని యోగీ వెల్లడించారు. భారతదేశం యొక్క కొత్త శక్తిని దేశమే కాకుండా ప్రపంచం చూస్తోందని, ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచం ముందు కొత్త ఉదాహరణగా నిలిచిందని యోగీ తెలిపారు.












Click it and Unblock the Notifications