"ఈసారి ప్రధాని పదవికి రాజీనామా చేసేయ్..!"- సీఎం చేసిన పనికి దిప్కేకు డిమాండ్లు..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యల స్ఫూర్తితో ఆన్ లైన్ పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ తర్వాత నీట్ అక్రమాలపై రోడ్డెక్కి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించేవరకూ వెళ్లింది. ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ నేతలు విసిరిన సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. వీటికి ఆకర్షితులైన జెన్ జీ యువత ఢిల్లీ వరకూ వచ్చి ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా పోలీసులతో లాఠీదెబ్బలు, పెల్లెట్ల దెబ్బలు కూడా తిన్నాయి. అయితే ఈ ఉద్యమం ముగిశాక దేశంలో పలు కీలక సమస్యలపై ఫోకస్ పెడుతున్న కాక్రోచ్ లు తమ సెటైర్ల దాడిని మాత్రం ఆపడం లేదు.
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ ఏజెన్సీ ప్రాంతంలో 30 మంది గిరిజన పిల్లలు కలుషితమైన నీరు తాగి అనారోగ్యంతో చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) నేరుగా అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాల్ని కలిశారు. ఈ ఘటనకు బాధ్యతగా సీఎం మోహన్ యాదవ్ రాజీనామా కోరారు. ఆయన స్పందించకపోవడంతో తననే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటూ, ఈ ఘటనకు సిగ్గుపడుతూ రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్ కు ఓ లేఖ పంపారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీఎం అభిజీత్ దిప్కే రాజీనామా పేరుతో ఇప్పటికే ఇది ట్రెండ్ అవుతోంది. అయితే దీని తర్వాత జరిగిన మరో ఘటనతో ఆయన్ను ఈసారి ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి.

Yes! Indeed shameful beyond words.
— Florence Guite (@FlorenceGuite_) September 14, 2026
Shame on Prime Minster @abhijeet_dipke for not responding to this reporter.
He should immediately resign for failing to respond to a reporter. #ResignPMAbhijeet https://t.co/GPSeUAUZeU
ఉత్తర్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి, తాను చెప్పాలనుకున్నది విలేఖరులకు చెప్పేసి వెళ్లిపోతుండగా.. అందులో ఓ మహిళా రిపోర్టర్ ఆయన్ను తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఇప్పుడు అభిజీత్ దిప్కేకు లింక్ చేస్తూ ముఖ్యమంత్రి దిప్కే రాజీనామా చేయాలని ఒకరు సోషల్ మీడియాలో డిమాండ్ చేయగా.. మరొకరు దీన్ని రీట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి దిప్కే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు కాక్రోచ్ ల సెటైర్ల వర్షాన్ని కొనసాగిస్తున్నారు. జెన్ జీ తెచ్చిన ఈ మార్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.














Click it and Unblock the Notifications
