మీరిచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటారని తెలుసు..! వారణాసి ప్రజలపై భరోసా వ్యక్తం చేసిన మోదీ..!!

ఢిల్లీ/హైదరాబాద్ : సొంత నియోజక వర్గంలో ప్రచారానికి ఆ నాయకుడు వెళ్లడం లేదు. తనను ప్రజలు గెలిపిస్తారన్న అపార నమ్మకంతో తన నియోజక వర్గంలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆ నాయకుడు భావిస్తున్నారు. అందులో బాగంగానే ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నిమినేషన్ సందర్బంగా ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని ఆ నాయకుడు ఎక్కడలేని నమ్మకంతో ఉన్నారు. ప్రలజపై అంత నమ్మంతో ఉన్న ఆ మహా నాయకుడు ఎవరో కాదు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నే.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ పోలింగ్ మరో ఐదు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన వారణాసి ఓటర్లకు మోదీ ఓ వీడియో మెసేజ్ పంపి సంచలనం స్రుష్టించారు.

You know that your promise will be retained.!Modi has expressed confidence about Varanasi people.!!

వారణాసిలో తాను ప్రచారం చేయకపోవచ్చేనే సంకేతాలను ప్రధాని మోదీ ఈ వీడియో ద్వారా ఇచ్చారు. వారణాసిలో నేను రోడ్ షోకు వచ్చినప్పుడు... మరోసారి ఇక్కడకు రావద్దని మీరు నన్ను ఆదేశించారు. అన్ని విషయాలను సమర్థవంతంగా మీరే చూసుకుంటామని చెప్పారు. మీ మాటలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మోదీ గెలవాలని కాశీలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. వారణాసిలోని ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. దేశం మొత్తం కాశీవైపే చూస్తోందని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను ఈసారి కాశీ తిరగరాయాలని చెప్పారు. సాంప్రదాయ దుస్తులను ధరించి ఓటు వేయాలని మోదీ విజ్నప్తి చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+