పెట్టింది లక్ష.. వచ్చింది 80 కోట్లు.. అదృష్టం అంటే ఇదే బాసు !
జీవితంలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం. అలానే ఎప్పుడెక్కడ, ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. 30 ఏళ్ల క్రితం ఓ తండ్రి పెట్టిన చిన్న పెట్టుబడి... ఇప్పుడతని కొడుకుకు కోట్లాది విలువను తెచ్చిపెట్టింది. ఈ అద్భుత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
1990లో పెట్టిన రూ.1 లక్ష.. 2025లో రూ.80 కోట్లు..
1990లో ఒక వ్యక్తి జిందాల్ గ్రూప్ నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేశాడు. కాలక్రమేణా వాటికి సంబంధించిన పత్రాలు కాస్త మర్చిపోయాడు. అవి ఇంట్లో ఓ మూలన నిలిపివేశాడు. ఇటీవల అతడి కొడుకు ఆ పాత పత్రాలను కాస్త ఆరా తీయగా ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ షేర్ల విలువ రూ.80 కోట్లు అని తేలడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఆనందాన్ని ఆపుకోలేక సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశాడు.

ఎక్స్ వేదికగా సౌరవ్ దత్తా అందుకు సంబంధించిన డాక్యుమెంట్ లను షేర్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు సైతం రెస్పాండ్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. పెట్టుబడుల విషయంలో లాంగ్ టర్మ్ వ్యూహం ఎంత ముఖ్యమో మరోసారి రుజువు అయ్యిందని ఒకరు కామెంట్ చేస్తే.. " patience pays ", " Time is the biggest multiplier in investing ", " Power of compounding is magical " అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L.
— Sourav Dutta (@Dutta_Souravd) June 7, 2025
Worth ₹80Cr today.
Power of buy right sell after 30yrs. pic.twitter.com/mZTpGt4LII
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications