Wife: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, ఫైటింగ్, విరక్తితో నవ వదువు ?, భర్తకు, ఫస్ట్ భార్యకు క్లైమాక్స్ !

బెంగళూరు: మతాతంతర వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేసి బిడ్డకు తండ్రి అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న చోట పరిచయం అయిన యువతికి మాయమాటలు చెప్పి ఆమెను లైన్ లో పెట్టిన కేటగాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్న కొత్తజంట ఐటీ హబ్ చేరుకుని కాపురం పెట్టారు. కొన్ని నెలల తరువాత మొదటి భార్య ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాత్రి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, ఇద్దరు భార్యలు గొడవపడ్డారు. వేకువ జామున నవ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నీ కూతురు ఆత్మహత్య చేసుకుంది, వచ్చి శవాన్ని తీసుకెళ్లండి అంటూ అల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నవ వివాహిత కుటుంబ సభ్యులు హడలిపోయారు.

మతాంతర వివాహం

మతాంతర వివాహం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డి ప్రసాద్ (24) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం అయేషాబాను (24) అనే యువతిని ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. రెడ్డి ప్రసాద్, ఆయేషా బాను దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మతాంతర వివాహం చేసుకున్న రెడ్డి ప్రసాద్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు.

మరో అమ్మాయిని లైన్ లో పెట్టాడు

మరో అమ్మాయిని లైన్ లో పెట్టాడు

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో (మదనపల్లె సమీపంలో) రెడ్డి ప్రసాద్ ఉద్యోగం చేసేవాడు. రెడ్డి ప్రసాద్ ఉద్యోగం చేస్తున్న చోట గౌతమి (24) అనే యువతి ఉద్యోగం చేస్తోంది. ఆ సందర్బంలో రెడ్డి ప్రసాద్, గౌతమికి పరిచయం అయ్యింది. ఉద్యోగం చేస్తున్న చోట పరిచయం అయిన గౌతమికి మాయమాటలు చెప్పిన రెడ్డి ప్రసాద్ ఆమెను లైన్ లో పెట్టి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

పెద్దలను ఎదిరించిన రెడ్డి ప్రసాద్, గౌతమి ఇదే ఏడాది మార్చి నెలలో పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న రెడ్డి ప్రసాద్, గౌతమి ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని మారతహళ్లిలోని కావేరి లేఔట్ లో కాపురం పెట్టారు. రెడ్డి ప్రసాద్ అతని మొదటి భార్య ఆయేషా బాను, కొడుకును చిత్తూరు జిల్లాలోనే పెట్టాడు.

ఫస్ట్ భార్య బెంగళూరులోకి ఎంట్రీ

ఫస్ట్ భార్య బెంగళూరులోకి ఎంట్రీ

రెడ్డి ప్రసాద్ ను పెళ్లి చేసుకున్న తరువాత అతనికి ముందే పెళ్లి అయ్యిందని గౌతమికి తెలిసి షాక్ అయ్యింది. మంగళవారం చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరిన ఆయేషా బాను మారతహళ్లిలోని కావేరీ నగరలో నివాసం ఉంటున్న భర్త రెడ్డి ప్రసాద్ ఇంటికి వెళ్లింది. ఆ సందర్బంలో రెడ్డి ప్రసాద్ ఇంట్లో లేడు. రెడ్డి ప్రసాద్ రెండో భార్య గౌతమి మాత్రమే ఉండటంతో ఆయేషా బాను ఆమెతో గొడవపెట్టుకుంది.

ఇద్దరు భార్యల రచ్చరచ్చ

ఇద్దరు భార్యల రచ్చరచ్చ


నీ ఫస్ట్ భార్య ఆయేషా బాను ఇంటికి వచ్చి గొడవ చేస్తోందని గౌతమి ఆమె భర్త రెడ్డి ప్రసాద్ కు ఫోన్ చేసే చెప్పింది. రెడ్డి ప్రసాద్ ఇంటికి వెళ్లాడు. తరువాత రెడ్డి ప్రసాద్, గౌతమి, ఆయేషా బానుల మద్య గొడవ జరిగింది. రానురాను గొడవ పెద్దది అయ్యింది. గౌతమి భోజనం చెయ్యకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

నీ కూతురు ఆత్మహత్య చేసుకుంది శవాన్ని తీసుకెళ్లండి

నీ కూతురు ఆత్మహత్య చేసుకుంది శవాన్ని తీసుకెళ్లండి

రాత్రి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు రెడ్డి ప్రసాద్, ఇద్దరు భార్యలు ఆయేషా బాను, గౌతమి గొడవపడ్డారు. వేకువ జామున 4. 30 గంటటల సమయంలో నవ వివాహిత గౌతమి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నీ కూతురు గౌతమి ఆత్మహత్య చేసుకుంది, వచ్చి శవాన్ని తీసుకెళ్లండి అంటూ రెడ్డి ప్రసాద్ పంగనూరులో ఉన్న ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.

కేటుగాడు, ఫస్ట్ భార్య అరెస్టు

కేటుగాడు, ఫస్ట్ భార్య అరెస్టు


ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నవ వివాహిత గౌతమి కుటుంబ సభ్యులు హడలిపోయి బెంగళూరు చేరుకున్నారు. నా అల్లుడు రెడ్డి ప్రసాద్, అతని మొదటి భార్య ఆయేషా బాను మా అమ్మాయి గౌతమిని హత్య చేశారని కేసు పెట్టారు. రెడ్డి ప్రసాద్, ఆయేషా బానును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+