నగ్న ఫోటోలతో ఇంటర్ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ ఆపై రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

చండీగఢ్: ఇంటర్ విద్యార్ధిని అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన కేసులో లలిత్ (21) అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్న లలిత్ అనే యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నట్టు బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రతి రోజూ టీజ్ చేసే లలిత్ గత నెలలో బలవంతంగా అతని స్నేహితుడు గౌరవ్ ఇంటికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తనను నగ్నంగా ఫోటోలు తీసి అసలు విషయాన్ని బయటకు చెబితే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని లలిత్ బెదిరించాడని పేర్కొంది.

Youth booked for raping, blackmailing a teenager

ఈ నగ్న చిత్రాల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనలో నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth has been booked for allegedly raping and blackmailing a 16-year-old girl here, police said today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి