పెళ్లికి నో చెప్పిన వేశ్యను చంపాడు, స్నేహితురాలిని..: జీవిత ఖైదు
ముంబై: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఓ వేశ్యను కత్తితో పొడిచి హత్య చేసిన 21 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదును ముంబై హైకోర్టు గురువారం నాడు సమర్థించింది. నిందితుడు అనంత్ అలియాస్ రాకేష్ రతన్ చేసుకున్న అప్పీలును ఇటీవల న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ తిరస్కరించింది. ప్రస్తుతం అతను నాసిక్ కేంద్ర కారాగారంలో ఉన్నాడు.
నిందితుడు మృతురాలును కత్తితో పొడవడం ద్వారా హత్యకు పాల్పడ్డాడని, దీంతో ఆమె మృతి చెందిందని, మృతురాలిని కాపాడేందుకు వచ్చిన మరో యువతి కూడా ఈ ఘటనలో గాయపడిందని పేర్కొంది. మృతురాలిని కాపాడేందుకు వచ్చి గాయపడిన కేసులో నిందితుడకి ఏడాది జైలు శిక్ష కూడా విధించారు.
నిందితురాలు రక్తం గ్రూపు మరకలు నిందితుడి చొక్కా, ప్యాంట్, అండర్‌వేర్ పైన పడ్డాయి. వీటిని కూడా కోర్టు పేర్కొంది. మృతురాలు, ఆమె స్నేహితురాలి పైన నిందితుడు దాడికి పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

కాగా, సదరు వేశ్యను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు అనంత్‌ను గాయపడిన స్నేహితురాలు, మరికొందరు స్థానికులు గుర్తించారు. తన పైన, తన స్నేహితురాలి పైన దాడి జరిగిన సమయంలో గాయపడ్డ యువతి కేకలు వేసింది. పక్కింటి వారు కూడా విన్నారు.
ఈ సంఘటన గ్రాండ్ రోడ్డులో.. తాము వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్న ఇంట్లో జరిగింది. గాయపడిన యువతి అతని నుండి తప్పించుకోవడానికి కాసేపు పెనుగులాడింది. ఈ సంఘటన 2009వ సంవత్సరంలో జరిగింది. కోర్టు అతనిని జూన్ 2010లో నిందితుడిగా తేల్చింది. ఇప్పుడు హైకోర్టు అతని జీవిత ఖైదును సమర్థించింది.












Click it and Unblock the Notifications