వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో చూసి నొప్పిలేకుండా టెక్కీ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకునే టెక్కీల సంఖ్య విపరీతంగా పెరగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా, దేశ రాజధానిలో ఓ టెక్కీ నొప్పి తెలియకుండా చనిపోవాలని ఆన్‌లైన్‌లో చూసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. ఓ 25ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. శాస్త్రీయ పరిశోధన కోసం తనకు కార్బన్ మోనాక్సైడ్ కావాలని చెప్పి చిన్న సిలిండర్ తెప్పించుకున్నాడు. ఆ తర్వాత ఓ పెద్ద పాలిథిన్ కవర్ తీసుకుని, అందులో తన ముఖంతోపాటు సిలిండర్ ను కూడా కలిపి పెట్టుకన్నాడు. కవర్ మొత్తం ముఖానికి గట్టిగా ప్యాక్ చేశాడు.

 Youth inhales CO for painless death

అప్పటికే సిలిండర్ వాల్వు తెరవడంతో కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకున్న అతడు నొప్పి తెలియకుండా తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాత్రూంలో ఉన్న అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, కావాలనే కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుధీర్ గుప్తా తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువు శరీరంలోకి వెళితే.. తక్కువ సమయంలోనే మరణం సంభవిస్తుందని వైద్యుడు చిత్తరంజన్ బెహరా వివరించారు. కాగా, ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో వీడియోలు చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

English summary
In a worrying trend of desperate Indians using the internet to find painless ways to kill themselves, a young web designer recently committed suicide by inhaling carbon monoxide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X