ప్రియురాలిని కాల్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

అజాంఘర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తేబన్‌పూర్‌లోని బన్గావ్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బన్గావ్ గ్రామానికి చెందిన రవీంద్ర(25) అనే యువకుడు సోమవారం తన ప్రియురాలైన పూర్ణిమ(18)ను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఆకాశ్ కుల్హరి తెలిపారు.

crime

కూతుర్ని చంపిన తండ్రి

ఆరు నెలల చిన్నారిని తండ్రే చంపి కాలువలో పడేసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బటాలాలోని దునియాసందు గ్రామానికి చెందిన ధర్మేంద్ర సింగ్ నాలుగు రోజుల క్రితం తన భార్య కన్వల్ జిత్ కౌర్‌తో గొడవపడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టి పుట్టింటికి పంపించాడు.

కాగా, వారి ఇద్దరు కుమార్తెలు అతని దగ్గరే ఉన్నారు. అదే రోజు తన ఆరు నెలల కుమార్తెను హతమార్చి కాలువలో పడేశాడు. కన్వల్ జిత్ కౌర్ ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్మేందర్‌ను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+