కేజ్రీ-రాహుల్‌ల కంటే మోడీయే, బిజెపికే యువ ఓటు!
న్యూఢిల్లీ: నేటి యువత స్పీడ్‌గా ఉంటుంది. తమ తమ లక్ష్యాలు చేరుకునేందుకు దూకుడుగా ఉంటుంటారు. అలాగే, సోషల్ మీడియాకు బానిస అయ్యే వారు కూడా చాలామందే ఉన్నారు. జీవితాన్ని ఆస్వాదిస్తూ... పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. అదే సమయంలో ప్రస్తుత యువత రాజకీయాల పైన దృష్టి సారిస్తోంది.
ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్తాన్ టైమ్స్ నేటి యువత రాజకీయ ఆసక్తి పైన ఓ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 5,000 మంది యువతను ప్రశ్నించింది. 18-25 సంవత్సరాల వయస్సు మధ్య గల వారిని అడిగింది. ఈ సర్వే 15 రాష్ట్రాలలో, పెద్ద నగరాలలో నిర్వహించారు.
ఇందులో పలు ఆసక్తిర విషయాలు తెలిశాయి. 48 శాతం మంది యువత బిజెపి, బిజెపి మిత్రపక్షాలను సమర్థించారు. పుణేలో 82.5 శాతం, జైపూర్‌లో 78.3 శాతం, అహ్మదాబాదులో 71.3 శాతం యువత ప్రస్తుత పాలక ప్రభుత్వాలకు ఓటేశారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో యువత బిజెపి, బిజెపి మిత్రపక్షాల వైపు నిలిచింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్డీయేకే తమ మద్దతు అని 84.8 శాతం మంది యువత చెప్పింది. 64.7 శాతం మంది తాము కాంగ్రెస్, మిత్రపక్షాలకు మద్దతిస్తామని పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా... ప్రధాని నరేంద్ర మోడీకి ఓటేశారు. ప్రధాని మోడీని అతిపెద్ద రాజకీయ ఐకాన్‌గా 51.7 శాతం మంది చెప్పారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 10.1 శాతం, సోనియా గాంధీ 7.1 శాతం, మమతా బెనర్జీ 5.7 శాతంతో ఉన్నారు. రాహుల్ గాంధీకి కేవలం 3.5 శాతం మంది మాత్రమే ఓటేశారు.












Click it and Unblock the Notifications