chicken kebab: కబాబ్ లో ఒక్క పీస్ తక్కువ వచ్చింది, హోటల్ ఓనర్ ను ఏం చేశారంటే ?, కలికాలం !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో సక్రమంగా కబాబ్ చేసే వాళ్లు కరువైనారు, ఉప్పు, కారం లేని కబాబ్, చిల్లీ చికెన్ తో పాటు చికెన్ ఐటమ్స్ లోని వివిద రకాల పదార్థాలు తిని చాలా మంది విసిగిపోతున్నారు. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పరిస్థితి సరేసరి. అయితే తెలుగు వాళ్లు ఎవరైనా హోటల్, చికెన్ కబాబ్ సెంటర్లు నిర్వహిస్తుంటే అక్కడ మాత్రమే ఉప్పు కారం ఉన్న చికెన్ కబాబ్ తో పాటు మంచి బిర్యానీలు చిక్కుతున్నాయి, లేదంటే ఐటీ హబ్ లో రుచిపచి లేని చికెన్ బిర్యానీలు, ఉప్పుకారం లేని చికెన్ కబాబ్ లు చిక్కుతున్నాయి. అయితే చికెన్ కబాబ్ లో ఒక్క పీస్ తక్కువ అయ్యిందని అర్దరాత్రి గొడవ జరగడం, ఆ తరువాత ఉప్పు, కారం విషయంలో నానా రచ్చ జరగడంతో ఆ హోటల్ యజమాని ముక్కు, మూతి, ముఖం పచ్చడి చెయ్యడం కలకలం రేపింది.

హోటల్ యజమాని
పార్శిల్ ప్యాకెట్‌లో కబాబ్ ఒక్క పీస్ తక్కువ వచ్చింది అని యువకులు హోటల్ యజమానిపై దాడి చేసిన ఘటన బెంగళు నగరంలోని కోననకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన మధ్యాహ్నం జరిగింది. కోననగుంటె సమీపంలోని ఈశ్వర్ లేఅవుట్‌లో హోటల్ నిర్వహిస్తున్న యజమాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు అభి, మనులను పోలీసులు అరెస్టు చేశారు.

మాంసాహారం హోటల్
బాబు చాలా సంవత్సరాలన నుంచి ఆ ప్రాంతంలో మాంసాహారం హోటల్ నడుపుతున్నాడు. అర్దరాత్రి రాత్రి నిందితులు బాబు హోటల్‌కు వెళ్లారు. రూ. 120 చెల్లించిన అభి, మను అనే నిందితులు ప్లేట్ కబాబ్ పార్శిల్ తీసుకున్నారు. ఇంటికి వెళ్లి పార్శిల్ తెరిచి చూడగా అక్కడ 10 ముక్కలకు బదులు 9 కబాబ్ పీస్ లు మాత్రమే ఉన్నాయి. 10 ముక్కలకు బదులుగా 9 ముక్కలు మాత్రమే కనిపించడంతో ఇద్దరు రగిలిపోయారు.

నాకొడకా కామిడీగా ఉందా అంటూ ?
అనంతరం ఇద్దరు నిందితులు మను, అభి నేరుగా బాబు హోటల్‌కు వెళ్లి కబాబ్ ముక్క కనిపించడం లేదని ప్రశ్నించారు. ఈ సమయంలో హోటల్ యజమాని బాబుతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో నిందితులు బాబు ముఖంపై చేతులతో, చేతికి చిక్కిన వస్తువులతో దాడి చేసిన మను, అభి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు మను, అభి దాడిలో తీవ్రగాయాలైన హోటల్ యజమాని బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మను, అభిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క చికెన్ కబాబ్ పీస్ కోసం హోటల్ యజమాని ఓనర్ కు ముఖం పగిలిపోయి కుట్లు పడేలా దాడి చెయ్యడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications