బాలికపై రేప్‌: అడ్డుకున్న అత్త మామలను కాల్చారు

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో మహిళలపై అత్యాచారాలకు అదుపు లేకుండా పోతుంది. ముజఫర్‌నగర్ జిల్లాలోని దివాల్ గ్రామంలో బుధవారం మరో దారణం వెలుగు చూసింది. పొలంలో గడ్డి కోసుకునేందుకు వచ్చిన 22ఏళ్ల యువతిపై నలుగురు యవకులు అత్యాచారానికి యత్నించారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న యువతి బంధువులైన అత్త, మామలు యువకులను అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఆ నలుగురు యువకులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

Youths attempt to rape girl, shoot at family members

ఆ తర్వాత యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్ధానికులు సాయంతో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి యత్నించిన నలుగురు నిందితులు అలీ, జావేద్, ఖలీద్, చమన్‌లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+