Chandrayaan 3 విజయంపై జగన్, చంద్రబాబు, పవన్ ఏమన్నారంటే ?
చంద్రయాన్ 3 ప్రయోగం ఇవాళ విజయవంతమైంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగడంతో ఏపీలో సంబరాలు మిన్నంటాయి. రాష్ట్రంలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంపై వివిధ పార్టీల నేతలు, సీఎం, గవర్నర్ స్పందించారు. దేశానికి చారిత్రక విజయం అందించిన ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు జగన్, చంద్రబాబు, పవన్, గవర్నర్ ట్వీట్స్, ప్రకటనలు చేశారు.
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కాగానే ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారత్‌కు అపురూపమైన విజయం! చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, నేను, భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వంతో నిండిపోయాను! అందరికీ నా శుభాకాంక్షలు మరియు అభినందనలు @ఇస్రో . ఈ అపురూపమైన ఫీట్ మన స్వంత #ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి సాధించబడింది, ఇది మరింత ప్రత్యేకమైనది! అంటూ జగన్ ట్వీట్ లో తెలిపారు.

చంద్రయాన్ విజయంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మనం ఈ రోజు చరిత్రను స్క్రిప్ట్ చేసాము! అభినందనలు @ఇస్రో అన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ మరియు ఈ ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా అవతరించింది. భారతదేశ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని చంద్రునిపైకి మరియు వెలుపలకు తీసుకెళ్లాలనే వారి అచంచలమైన స్ఫూర్తిని మరియు సంకల్పానికి నేను వందనం చేస్తున్నాను. భారతదేశం అనంత యుగం ప్రారంభంలో ఉంది. మేము ఆపలేము! అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ పై పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ చంద్రయాన్-3లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టం. ఇంతటి విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలు సర్వదా అభినందనీయులు. ఇస్రో బృందానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు.
An incredible achievement for India!
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023
On the Chandrayaan-3’s successful soft landing on the moon, I, along with every citizen of India is filled with pride!
My wishes and congratulations to everyone @isro.
That this incredible feat was achieved from Sriharikota in our very own… https://t.co/PYQXe8pwj7
చంద్రయాన్ సక్సెస్ పై గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైందని, చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని, చంద్రయాన్-3 మిషన్ యొక్క అద్భుత విజయానికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని, ఇది చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా, నిర్దేశించని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న ఏకైక దేశంగా భారత్‌ను నిలబెట్టిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, చంద్రయాన్-3 మిషన్‌తో సంబంధం ఉన్న ప్రతి సభ్యుడిని గవర్నర్ అభినందించారు.












Click it and Unblock the Notifications