మెరీనా బీచ్ నిండా జగన్ ఫ్లెక్సీలు, ఇబ్బందని తొలగింపు

 YS Jagan
చెన్నై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని మెరీనా బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన ఫ్లెక్సీలు, బ్యానర్లను స్థానిక కార్పోరేషన్ యంత్రాంగం తొలగించింది.

జగన్ రాకను పురస్కరించుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిమానులు, కార్యకర్తలు మెరీనా తీరం వెంబడి పెద్ద ఎత్తున ఆయన చిత్ర పటాలతో కూడన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో అధికారులు వాటిని తొలగించారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా జగన్ బుధవారం చెన్నై వెళ్లగా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

రాష్ట్ర సమైక్యత కోసం జగన్ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను మధ్యాహ్నం రెండు గంటలకు, మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధిలను కలిసిన విషయం తెలిసిందే. వారిని కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ 2014 ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణగా తీసుకోవాలని కాంగ్రెసు పార్టీకి సూచించిన విషయం తెలిసిందే.

విభజనపై వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానానికి సవాల్ విసిరారు. జయలలిత, కరుణానిధిలిద్దరు తాను చెప్పిన విషయాలను విన్నారని, ఇది ముఖ్యమైన అంశమని వారు గుర్తించారని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు నమ్మకం ఉంటే ప్రజల తీర్పు కోరాలని ఆయన కాంగ్రెసుకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+