మోదీ రాకతో మారుతున్న సమీకరణాలు, టార్గెట్ వైసీపీ, మాజీ సీఎం ఎంట్రీతో రివర్స్ గేర్ !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న సందర్బంగా రాజకీయ నాయకుల జంప్ జిలానీలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసిన తరువాత పలు ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి మాజీ సీఎం ఇలాఖాలో రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులు వస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ చాలా గ్యాప్ తరువాత బీజేపీలో చేరారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాజంపేట లోక్ సభ నియోజక వర్గం పరిధిలో చాలా మంది బీజేపీలో చేరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పీలేరు నియోజక వర్గంలోని కలికిరిలో, రాజంపేట లోక్ సభ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన తరువాత బీజేపీ పుంజుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు బీజేపీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాయలసీమలో ఎన్నికల ప్రచారం చేసిన తరువాత బీజేపీ పుంజుకుంది. మదనపల్లె సమీపంలోని నిమ్మనపల్లెకు చెందిన రెడ్డివారి పెమ్మిరెడ్డి కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

సునీల్ కుమార్ రెడ్డితో పాటు చాలా మంది నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట లోక్ సభ నియోజక వర్గంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఓడించి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తామని సునీల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు పని చేస్తామని, అందుకు సునీల్ కుమార్ రెడ్డి సహకారం అవసరం అని ఇదే సమయంలో అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చల్లని ఆశీస్సులతో రాజంపేట లోక్ సభ నియోజక వర్గం ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నిమ్మనపల్లెతో పాటు కిలికిరి, పీలేరు, మదనపల్లె, తంబళపల్లెకు చెందిన చాలా మంది నాయకులు టీడీపీ, బీజేపీలో చేరుతున్నారు. పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తారని, త్వరలో ఇంకా చాలా మంది వైసీపీ నాయకులు బీజేపీ, టీడీపీలో చేరుతారని కిరణ్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా అంటున్నారు.












Click it and Unblock the Notifications