పార్లమెంట్ లో ఒక్కటైన వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్-మళ్లీ మోడీకి అండగా..!

పార్లమెంట్ లో ఇవాళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అన్ని విషయాల్లో అండగా నిలిచిన వైసీపీ, బీఆర్ఎస్ తో పాటు ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్ సైతం ఏకతాటిపైకి వచ్చాయి. ప్రధాని మోడీ ఆలోచనకు అండగా నిలిచాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ మూడు ప్రాంతీయ పార్టీల వైఖరిపై చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ లో ఇవాళ కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రెండు బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ దీనిపై చర్చ చేపట్టింది. ఇందులో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల ఎంపీలు కూడా జమిలి ఎన్నికల బిల్లులకు మద్దతుగా నిలిచాయి. టీడీపీ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. జమిలి బిల్లులకు బేషరతుగా మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు.

ysrcp tdp brs stand united in support of one nation one election bills in lok sabha

అనంతరం లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై ఎంపీలకు ఈ-ఓటింగ్ నిర్వహించారు. ఇందులో టీడీపీతో పాటు వైసీపీ, బీఆర్ఎస్ ఎంపీలు కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఓటేశారు. వీరితో పాటు జనసేన ఎంపీలు కూడా కేంద్రానికి అండగా నిలిచారు. దీంతో జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపించాలన్న కేంద్రం అభిప్రాయానికి అనుకూలంగా వీరంతా అండగా నిలిచినట్లయింది. జేపీసీ అభిప్రాయం తర్వాత కూడా ఆయా పార్టీలు కేంద్రం ఆలోచనకు మద్దతునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+