మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్
మణిపూర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా యమునాం కేంచంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనను బీజేపీ పక్ష నేతగా తాజాగా ఎన్నుకున్నారు. దీంతో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ లో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మణిపూర్ లో జాతి ఘర్షణల కారణంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు మణిపూర్ అట్టుడుకిపోయింది. ఈ నేపథ్యంలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించారు.
మణిపూర్ కొత్త సీఎంగా యమునాం కేంచంద్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో మరికొన్ని గంటల్లో మణిపూర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం 60 మంది సభ్యులకు గాను బీజేపీకి సగానికిపైగా అంటే 37 మంది సభ్యుల బలం ఉంది. దాంతో యమునాం కేంచంద్ సింగ్ ను బీజేపీ పక్ష నేతగా నాయకులు ఎన్నుకున్నారు. ఇక మైతేయిలు, కుకీల మధ్య జరిగిన సంఘర్షణల్లో రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకిపోయింది. ఏడాది కాలంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
ఇక ఈ రెండు తెగల మధ్య ఘర్షణల కారణంగానే మణిపూర్ లో అప్పటి సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో మణిపూర్ లో ఖేమ్ చంద్ సింగ్ తదుపరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన వెలువడింది.

ఇక మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు 37 మంది ఉన్నారు. ఆ తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వారు ఆరుగురు ఉన్నారు. నాగా పీపుల్ ఫ్రంట్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కుకీ పీపుల్స్ కూటమి నుంచి ఇద్దరు, జనతాదళ్ యునైటెడ్ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గా ఉన్నారు.












Click it and Unblock the Notifications