'దంగల్' అమ్మాయికి భద్రత: బలవంతపు సారీపై వెంకయ్య..
దంగల్ సినిమాలో నటించిన జైరా వసీంకు భద్రత కల్పిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం నాడు తెలిపారు.
న్యూఢిల్లీ: దంగల్ సినిమాలో నటించిన జైరా వసీంకు భద్రత కల్పిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం నాడు తెలిపారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలవడం, ఆమె తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ట్వీట్ పెట్టడం, ఆమెకు బెదిరింపులు రావడం తెలిసిందే.
జైరా ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణ కోరుతూ బహిరంగలేఖ పోస్ట్ చేసి తొలగించడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జైరాపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అవసరమయితే భద్రత కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తుందని జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలోని యువత.. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదం నీడలో పెరిగే యువత తమ ప్రతిభతో ఎదిగితే వారిని అభినందించడం సమాజం బాధ్యత అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా జైరా వసీంకు మద్దతుగా నిలిచారు. అసలు ఆమె క్షమాపణ ఎందుకు చెప్పాలన్నారు. తన రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితో భేటీ అయినందుకు క్షమాపణ చెప్పాలా అన్నారు. దీనిని బట్టే సూడో లిబరల్స్ వివిధ సందర్భాలలో ఎలా స్పందిస్తారో అర్థమవుతోందన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications