అక్షరాలపై మృత్యు తాండవం, 115 పసి ప్రాణాలు బలి!

అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో, ఆటపాటలతో గడపాల్సిన ఆ పసిప్రాణాలు యుద్ధ తంత్రాలకు బలైపోయాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు నిప్పులు కురిపిస్తున్నాయి. శనివారం ఉదయం ఇరాన్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజైంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ గడ్డ దడదడలాడగా, దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన ఒక ఘోరకలి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యుద్ధ క్షేత్రంలో అక్షరాలపై మృత్యు తాండవం చేసింది. తల్లిదండ్రులు తమ బిడ్డలను స్కూల్ గేటు వద్ద దింపి వెళ్తున్న సమయంలోనే ఈ దాడులు ప్రారంభం కావడంతో, ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది.

మీజాన్ వార్తా సంస్థ నివేదికల ప్రకారం, ఈ క్షిపణి దాడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, పాఠశాల భవనం శిథిలాల కుప్పగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. కాలిన గోడలు, రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, చెల్లాచెదురుగా పడి ఉన్న చిరిగిన పాఠ్యపుస్తకాలు ఆ ప్రాంతంలో జరిగిన భీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి. అక్కడ ఉన్న 'షజారెహ్ తయ్యేబె' బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో కనీసం 115 మంది చిన్నారులు విగతజీవులయ్యారు.

Tragedy in Iran 115 Schoolgirls Killed in Minab Airstrike Amid Escalating Israel-Iran Conflict and Turmoil

శిథిలాల మధ్యలో బిడ్డల ఆనవాళ్ల కోసం..

వందలాది మంది బాధితులు తమ బిడ్డల ఆనవాళ్ల కోసం శిథిలాల మధ్య వెతుకుతున్న తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ స్పందిస్తూ, శిథిలాల కింద నుంచి ఇంకా ఎన్ని మృతదేహాలు వస్తాయో ఊహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాల రివల్యూషనరీ గార్డ్స్ బ్యారక్‌లకు సమీపంలో ఉండటమే ఈ భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని..

మరోవైపు, దేశవ్యాప్తంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో ఇరానియన్లలో భయం, ఆశల మిశ్రమ భావాలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై 'ప్రధాన పోరాట కార్యకలాపాలను' ప్రకటిస్తూ, ప్రజలు తమ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపునివ్వడం రాజకీయంగా కలకలం రేపింది. టెహ్రాన్ నగరంలో బాంబులు పడుతున్నా, కొందరు ప్రజలు ప్రభుత్వ అణచివేత నుండి విముక్తి లభిస్తుందని ఆశపడుతున్నారు.

యుద్ధంలో చనిపోవడం మాకు కొత్తేమీ కాదు..

గత ఏడు వారాలుగా నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాది మంది మరణించడమే ఈ వింత పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. "మా స్వంత ప్రభుత్వం చేతుల్లో చనిపోవడం కంటే, యుద్ధంలో చనిపోవడం మాకు కొత్తేమీ కాదు" అని అక్కడి యువత వాపోతున్నారు.

మినాబ్ పాఠశాల ఉదంతం అమెరికా నేతృత్వంలోని దాడులలో జరిగిన అతిపెద్ద పౌర ప్రాణనష్టంగా రికార్డుల్లో నిలిచిపోనుంది. ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రక్తపాతం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+