ఆప్ఘన్‌లో భూకంపం: 12 మంది మృతి, పలువురికి గాయాలు..
భూకంపంతో ఆప్ఘనిస్తాన్ ఉలిక్కిపడింది. ఖాదీస్ జిల్లాలో.. బాగ్దిస్‌లో 5.3 తీవ్రతతో భూమి కంపించిది. భూమి కంపించడంతో వేసిన రేకులు పై నుంచి కూలిపోయాయి. ఇంకేముంది వాటి ధాటికి 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆప్ఘన్‌లో తాలిబాన్లు అడుగుపెట్టక పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో భూకంపంతో మరింత నష్టం చేకూరింది. ఆప్ఘన్‌లో వరసగా భూకంపాలు వస్తుంటాయి. హిందు కూష్ పర్వత ప్రభావం వల్లనెమో భూమి కంపిస్తూ ఉంటుంది. 2015లో వచ్చిన భూకంపంతో 280 మంది చనిపోయారు.
భూమి యొక్క ఉపరితలంపై కంపనం, ఇది భూమి లోపల నుండి అకస్మాత్తుగా శక్తిని విడుదల చేయడం వలన సంభవిస్తుంది. ఈ శక్తి విడుదల టెక్టోనిక్ ప్లేట్ల కదలిక నుండి వస్తుంది, ఇది కదలిక సమయంలో శక్తిని విడుదల చేస్తుంది. దీనినే భూకంపం అంటారు. తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.ఎంత లోతు వరకు ప్రభావితం అయ్యిందనే అంశం ఆధారంగా లెక్కగడతారు.












Click it and Unblock the Notifications