వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం 120 మంది సజీవ దహనం, ఏమైందంటే?

పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంజాబ్: పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అహ్మద్ పూర్ షర్కియా వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. అయితే ట్యాంకర్ నుండి కిందపోతున్న ఆయిల్ ను స్థానికులు పెద్ద ఎత్తున తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

120 Burnt Alive in Pak's Bahawalpur, Had Rushed to Collect Oil from Overturned Tanker

ప్రమాదవశాత్తు ట్యాంకర్ నుండి ఆయిల్ ను తీసుకెళ్తుండగా అగ్ని ప్రమాదం వాటిల్లింది.దీంతో 120 మది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఆయిల్ ట్యాంకర్ సమీపంలో సిగరెట్ తాగడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కూడ 70 శాతం కంటే ఎక్కువగా కాలిపోయారని స్థానికులు చెప్పారు. మృతులను డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

English summary
More than 100 people were burnt to death and dozens injured when an oil tanker overturned and exploded on a highway near Bahawalpur city in Pakistan’s Punjab province on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X