13 మంది పోలీసుల మృతి.. చెక్ పోస్ట్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రమూకల దాడి.. పలువురికి గాయాలు

ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పోలీస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 13 మంది ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అల్ రషాద్ ప్రాంతంలో కిర్కుక్ నగరానికి సమీపంలో అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగిందని ఇరాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి.ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు పేర్కొన్నారు.

ఇరాక్ లోని పలు ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్ఐఎస్ తరచుగా సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ ఏడాది జులై 19న రాజధాని బాగ్దాద్ శివారు ప్రాంతంలో బాంబు దాడి జరిపి 30 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం ఇరాక్ లో సంకీర్ణ దళాల సంఖ్య 3,500 కాగా, వాటిలో 2,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు.

13 police personnel killed in ISIS terrorist attack near Kirkuk

Recommended Video

    Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Oneindia Telugu

    జో బైడెన్ అధికారంలోకి వచ్చాక మధ్య ప్రాచ్యం, ఆసియా వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ దళాలను పూర్తిగా వెనక్కి పిలిపించారు. ఇరాక్ లోనూ వచ్చే ఏడాది నుంచి స్థానిక సైన్యానికి శిక్షణ, సలహాలు ఇచ్చేందుకే తమ బలగాలను పరిమితం చేయాలని బైడెన్ నిర్ణయించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+