15 మంది మృతి, 500 పైచిలుకు గాయాలు.. శరణార్థ శిబిరంలో ప్రమాదం
బంగ్లాదేశ్‌లో గల రోహింగ్యా క్యాంప్‌లో మంటలు చెలరేగాయి. కాక్స్ బజార్ వద్ద రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించారు. అయితే మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 15 మంది రోహింగ్యాలు చనిపోయారని.. 400 మంది ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది.

Recommended Video
AP Sand Policy: రాష్ట్రమంతా ఇసుకకు ఒకే రేటు, ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు - AP Govt
ప్రమాదంలో 560 మంది వరకు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ రీప్రంజెటివ్ జోహన్నిస్ వాన్ దర్ తెలిపారు. ప్రమాదంతో 10 వేల మందిపై ప్రభావం చూపిందన్నారు. 45 వేల మంది వరకు నిరాశ్రయులు అయ్యారని వివరించారు. అగ్నిప్రమాదంతో శరణార్థుల జీవితంలో చీకటి నింపింది. నిలువనీడను కూడా కోల్పోయారు.












Click it and Unblock the Notifications