లైవ్ షో: ఇద్దరు టీవీ జర్నలిస్టులను కాల్చి చంపారు
వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆంగతకుడు కాల్చిచంపాడు. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ ఫోర్డ్ కౌంటీలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్‌కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్ (24), వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్ (27) మౌంటేన్ లేక్‌కు సమీపంలోగల బ్రిడ్జ్ వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు.

అదే సమయంలో ఆ బిల్డింగ్‌లోకి చొరబడ్డ ఆగంతకుడు రిపోర్టర్, కెమెరామెన్‌ను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. ఆగంతకుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్ కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
TV reporter and photographer killed in shooting during live interview in Virginia. http://t.co/ezYCikTIjw
— Nieman Foundation (@niemanfdn) August 26, 2015 











Click it and Unblock the Notifications