లోయలో పడిన బస్సు: 20మంది క్రీడాకారుల మృతి
మెక్సికన్ సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు.
అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెరాక్రూస్ ప్రాంతంలో 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని అటోయక్ నదిలో పడిపోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులంతా కమరోన్, కోర్డోబా ప్రాంతాలను చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులేనని అధికారులు తెలిపారు.
బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే అదుపులో తప్పి లోయలో పడివుంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఘటనపై మెక్సికన్ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications