Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

140 మంది హిందువులు, సిక్కులను, 20 మంది భారతీయులను అడ్డుకున్న తాలిబన్లు: ఇంకా కాబూల్‌లోనే

కాబూల్: ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్ర‌యంలోనికి వెళ్లేందుకు వ‌చ్చిన 140 మంది హిందువులు, సిక్కులను తాలిబ‌న్ల అడ్డుకున్నారు. మరో 20 మంది భారతీయులను కూడా ఆపేశారు. ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫోర‌మ్ అధ్య‌క్షుడు పునీత్ సింగ్ ఈ విష‌యాన్ని తెలిపారు. తాలిబ‌న్ల ఇచ్చిన డెడ్‌లైన్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాబూల్ నుంచి త‌ర‌లివెళ్లేందుకు జ‌నం ఎయిర్‌పోర్ట్‌కు త‌ర‌లివ‌స్తున్నారు.

అయితే హిందూ, సిక్కు మ‌తానికి చెందిన 140 మందిని గురువారం తాలిబ‌న్లు అడ్డుకున్న‌ట్లు, వారిని వెనక్కి పంపినట్లు ఇండియ‌న్ వ‌రల్డ్ ఫోర‌మ్ పేర్కొంది. దీని వ‌ల్ల కాబూల్ విమానాశ్ర‌యం నుంచి ఇండియాకు రావాల్సిన వైమానిక ద‌ళ ప్ర‌త్యేక విమానం నిలిచిపోయింది.

 20 Indian nationals, 140 Afghan Sikhs and Hindus still stranded in Afghanistan, due to stopped by Taliban

గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో భారత అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ పేలుళ్ల నుంచి ఈ 160 మంది తప్పించుకున్నారు. ఈ క్రమంలో 140 మంది హిందువులు, సిక్కులతోపాటు 20 మంది భారత జాతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

కాగా, త‌ర‌లింపు ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా సుమారు 565 మందిని త‌ర‌లించింది. దీంట్లో 175 మంది భార‌తీయ ఎంబ‌సీ సిబ్బంది ఉన్నారు. దానికి తోడు 263 మంది భారతీయులతో పాటు 112 మంది ఆఫ్ఘ‌న్ జాతీయులు కూడా ఉన్నారు.

కాబూల్ జంట పేలుళ్లలో 60కి చేరిన మరణాలు, 150 మందికి తీవ్రగాయాలు

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. వీరిలో నలుగురు యూఎస్ మెరైన్స్ కూడా ఉన్నారు. 150 మందికిపైగా పౌరులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురు అమెరికా సైనికులు ఉన్నారు.

మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం భీతావాహంగా మారింది. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, గాయపడినవారి ఆర్తనాదాలతో ఘటనా స్థలాలు హృదయవిదారకంగా మారాయి. కాగా, మొదట పేలుడు బారన్ హోటల్ వద్ద జరిగింది. ఆ తర్వాత రెండో పేలుడు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం అబ్బే గేట్ సమీపంలో చోటు చేసుకుంది.

ఇతర దేశాలకు వెళ్లేందుకు వేలాది మంది విమానాశ్రయం ఆవరణలో వేచివున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు భారీ జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, తాలిబన్లు ఈ దాడికి పాల్పడలేదని అంటున్నారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడివుంటారని తాలిబన్లు చెబుతుండటం గమనార్హం.

ఆగస్టు 31 వరకు తరలింపు గడువు విధించడంతో వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. గురువారం ఉదయమే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించగా.. కొద్ది గంటల సమయంలోనే ఉగ్రవాదులకు దాడులకు దిగడం సంచలనంగా మారింది.

పేలుళ్ల ఘటనతో ఆయా దేశాలు తమ పౌరులను వెంటనే తమ తమ దేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. భారత్ ఇప్పటికే 600 మందికిపైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే, దీరిలో పలువురు ఆప్ఘాన్ పౌరులు కూడా ఉన్నారు. తాజాగా, మరో 140 మంది హిందువులు, సిక్కులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. గురువారం తాలిబన్లు అడ్డుకున్నారు. దీంతో వారు కాబూల్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరిని కూడా భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

దాడులు ఐఎస్ ఉగ్రవాదుల పనేనంటూ తాలిబన్ నేతలు

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలను తాలిబన్లు ఖండించారు. ఇలాంటి ఘటనలను తాము అంగీకరించబోమని తెలిపారు. అంతేగాక, ఈ పేలుళ్లకు ఐఎస్ ఉగ్రవాదులే కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు తాలిబన్ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజహిద్.

Recommended Video

    Talibans ఆశ్చర్యపరిచారు.. ఇండియన్ ఆర్మీ సిద్దం.. Bipin Rawat వార్నింగ్ || Oneindia Telugu

    అమెరికా ఇప్పటికే ఉగ్రవాద దాడి జరగవచ్చని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాలిబన్ల నేలను ఉగ్రవాదులు ఉపయోగించుకునేందుకు ఎంతమాత్రమూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను చట్టం ముందు నిలబెడతామని మరో తాలిబన్ అధికార ప్రతినిధి సుహిల్ షాహీన్ తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+