గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులు: 20మంది మృతి
అబూజ: బోకోహారం తీవ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. నైజీరియాలోని ఓ గ్రామంలో బోకోహారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రజలు మృతిచెందారు. బార్నో రాష్ట్రం హావుల్ జిల్లాలోని మూరుమూల డెబిరో గ్రామంలో ఈ దాడులు జరిగాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం కొందరు తీవ్రవాదులు ద్విచక్రవాహనాలు, వ్యాన్లలో వచ్చి డెబిరో గ్రామాన్ని చుట్టిముట్టి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.

ఈ కాల్పుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందినట్లు చెప్పారు. కనిపించిన వారిని కనపడినట్లు కాల్చారని.. ప్రాణ భయంతో పరుగులు తీసి దాడుల నుంచి తప్పించుకున్న బాధితులు చెప్పారు. బోర్నో రాజధాని మైదుగురికి 250 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగిన ప్రదేశం ఉంది.












Click it and Unblock the Notifications