Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: స్వీట్స్ తిని 23మంది మృతి, ఆస్పత్రిలో 52మంది

లాహోర్: పాకిస్థాన్‌లో విషాదం ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ప్రొవిన్స్‌లోని కరర్ లాల్ ప్రాంతంలో ఉమర్ హయత్ నివాసముంటున్నాడు. అతని మనవడి పుట్టినరోజు వేడుక ఏప్రిల్ 17న జరిగింది.

ఈ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఆ పుట్టినరోజు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీకి వెళ్లివచ్చిన 10 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

sweets

52 మంది దాకా అస్వస్థతకు లోనయ్యారు. విషపూరితమైన స్వీట్స్ తినడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసులు ఆ స్వీట్స్ తయారుచేసిన బేకరీ యజమానిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసకున్నారు.

స్వీట్స్‌ను పరీక్షల కోసం పంపారు. స్వీట్లలో పెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ల్యాబ్ టెస్టుల తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+