ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: 245మంది ఒకేసారి వంతెన మీద నుంచి దూకేశారు
బ్రెజిల్‌లోని హోర్డోలాండియా ప్రాంతంలోని ఓ వంతెన ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వేదిక అయింది. 245 మంది ఒకేసారి వంతెన మీద నుంచి కిందకి దూకేశారు.
బ్రెజిల్: బ్రెజిల్‌లోని హోర్డోలాండియా ప్రాంతంలోని ఓ వంతెన ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వేదిక అయింది. 245 మంది ఒకేసారి వంతెన మీద నుంచి కిందకి దూకేశారు.
రికార్డు కోసం దాదాపు 245 మంది (పురుషులు, మహిళలు) వంతెన మీదకు చేరుకొని లైనుగా నిలబడ్డారు. అందరూ రోప్ జంపింగ్ చేసుకునేందుకు నడుముకు నైలాన్ రోప్‌ను కట్టుకున్నారు. అందరూ ఒక్కసారిగా వంతెన మీద నుంచి కిందకి దూకేశారు.

30 మీటర్ల ఎత్తైన వంతెన మీద అందరూ రోప్‌తో వేలాడుతూ కనిపించిన దృశ్యం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వీళ్లు చేసిన దానిని గిన్నిస్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు.
గిన్నిస్ వీరి సాహసాన్ని గుర్తిస్తే వీళ్లు గత రికార్డులను చెరిపేసినట్లే. 2016 ఏప్రిల్‌లో ఇదే వంతెనపై 149 మంది ఒకేసారి రోప్ జంప్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications