లఖ్వీ జైల్లో ఉండాల్సిందే: బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే ఇ తోయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ పిటిషన్‌ను పాకిస్ధాన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ కేసును తిరిగి ఇస్లామాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ముంబై దాడులకు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీనే కారణమంటూ నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవంటూ తీవ్ర వాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి డిసెంబర్ 18న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. లఖ్వీ బెయిల్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

లఖ్వీకి బెయిల్ ఇవ్వడం పట్ల పలు ప్రపంచ దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో ఆ తర్వాత రోజు ఎంపీఓ చట్ట ప్రకారం అతడిని నిర్భందంలోకి తీసుకున్నారు. ఐతే దీన్ని ఇస్లామాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో బెయిల్‌పై పాకిస్ధాన్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానికి అప్పీలుకు వెళ్లింది. దీన్ని విచారించిన పాకిస్ధాన్ సుప్రీం కోర్టు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని జైల్లోనే ఉంచాలంటూ తీర్పును వెలువరించింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications