ముగ్గురు భారతీయులకు క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డ్
లండన్: ఈ ఏడాది తొలిసారి ప్రదానం చేయనున్న ప్రతిష్టాత్మక ఎలిజబెత్-2 రాణి యువ నాయకుల అవార్డు(క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డు)కు ముగ్గురు భారతీయులు ఎంపికయ్యారు. కామన్వెల్త్ దేశాల్లో ప్రజల జీవితాల్లో మార్పును తెచ్చేందుకు కృషిచేస్తున్న యువతకు గుర్తింపుగా ఎలిజబెత్ రాణి ఈ ఏడాది క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డులు ప్రారంభించారు.

వీటికి ఎంపికైన 60మందికి జూన్ 22న రాణి పురస్కారాలు అందిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. భారత్ నుంచి అశ్విని అంగడి, అక్షయ్ జాదవ్, దేవికా మాలిక్ అవార్డును గెలుపొందారు.
బెంగళూరుకు చెందిన అశ్విని తనలాంటి అంధుల కోసం బ్రెయిల్ లిపి లో పలు పుస్తకాలు తీసుకువచ్చారు. విదర్భకు చెందిన అక్షయ్ విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నారు. దేవికా పలు అంతర్జాతీయ పారాఅథ్లెటిక్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.












Click it and Unblock the Notifications