30 లక్షల మంది.. రాజీకి సిద్దమని జెలెన్ స్కీ ఇండికేషన్స్
ఉక్రెయిన్‌ను రష్యా వదలడం లేదు. కీలక నగరాలే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ముఖ్య నగరాలను ఆక్రమించుకునే పనిలో బిజీగా ఉంది. ఇటు కివ్ నగరంపై విరుచుకుపడింది. ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మెట్టుదిగారు. రాజీకి సంకేతాలను ఇచ్చారు. వరసగా 21వ రోజు యుద్దం కొనసాగడంతో కంప్రమైజ్ అంటున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించొద్దు అని ఇదివరకు రెండుసార్లు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కివ్ రష్యా ఆధీనంలోకి వెళ్లనుంది. ఇక్కడ మంగళవారం జరిపిన దాడిలో డజన్ల కొద్దీ జనం చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఇదే విషయాన్ని జెలెన్ స్కీ చెప్పారు. 15 అంతస్తుల అపార్ట్ మెంట్‌పై దాడి చేయడంతో.. ఒకరు చనిపోయారనిమేయర్ విటలీ తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది వరకు ఇబ్బంది పడ్డారు. కొందరు చనిపోతే.. మరికొందరు పారిపోయారు.

ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతంలో గల రివ్నే వద్ద దాడి చేసింది. టెలివిజన్ టవర్‌పై నిన్న దాడి చేయడంతో 9 మంది చనిపోయారు. ఈ మేరకు గవర్నర్ విలలీ కొవై తెలిపారు. ఇప్పటికీ జనం బంకర్లలో దాక్కొని ఉంటున్నారు. ఇటు ఐక్యరాజ్యసమితి స్పందించింది. మానవత్వంతో 40 మిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌కు ప్రకటించింది.
యుద్దం వల్ల గత వారం నుంచి ఇక్కడ నిత్యావసరాలు లేకుండా గడుపుతున్నారు. విద్యుత్, గ్యాస్, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. యుద్దం వల్ల 1582 మంది ప్రజలు చనిపోయారు. టర్కీలోని ఉక్రేనియన్ రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, మారియుపోల్‌లోని ఒక మసీదులో ఆశ్రయం పొందిన వారిలో 36 మంది పిల్లలతో సహా 86 మంది టర్కీ జాతీయులు ఉన్నారని పేర్కొంది. శత్రువు ఇజియం ఉత్తర భాగంలో స్థిరపడిందని, దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వదిలిపెట్టదని ఉక్రెయిన్ పేర్కొంది. శత్రువులు మారియుపోల్ యొక్క తూర్పు పొలిమేరను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications