న్యూయార్క్‌లో కాల్పులు: షాపింగ్ చేస్తోన్న నాలుగేళ్ల చిన్నారి టార్గెట్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ చిన్నారితో పాటు ముగ్గురిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో గల ప్రతిష్ఠాత్మక టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం టైమ్స్ స్క్వేర్‌లోని 7వ అవెన్యూ, 44 స్ట్రీట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రూక్లిన్‌లో నివసించే ఓ కుటుంబం టైమ్స్‌ స్క్వేర్‌ను తిలకించడానికి వచ్చింది. తమ కుమార్తెకు బొమ్మలను కొంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ బాలికకు బులెట్ గాయాలయ్యాయి. ఆ కుటుంబంతో సంబంధం లేని మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారిలో ఒకరు రోడ్ ఐలండ్స్‌కు చెందిన పర్యాటకురాలు కాగా.. మరొకరు న్యూజెర్సీకి చెందిన మహిళ.

3 people including a 4-year-old girl were shot in New York Citys Times Square

Recommended Video

    Ram Charan క్రేజ్ కా బాప్, మీసం తిప్పిన చరణ్ ! | RRR Movie || Oneindia Telugu

    సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని నల్లజాతీయుడిగా గుర్తించినట్లు న్యూయార్క్ పోలీస్ కమిషనర్ డెర్మాట్ షియా తెలిపారు. అతను కనిపించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. నిందితుడిని మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించినట్లు డెర్మాట్ చెప్పారు. ఈ ఘటన వెనుక కారణాలేమిటనేది తెలియరావట్లేదని, దీనిపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+