భూకంపం: కుప్పకూలిన భవనం 20 మంది మృతి, 30 మంది అదృశ్యం
మెక్సికో: మెక్సికోలో భూకంపం సందర్భంగా ఓ స్కూల్‌లో విషాదం చోటుచేసుకొంది. ఆడుతూ పాడుతూ స్కూల్‌కు వెళ్ళిన 30 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. భూకంపం వల్ల 20 మంది చిన్నారులు చనిపోయారని అధికారులు ప్రకటించారు.
భూకంపం వల్ల సుమారు 217 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భూకంపం ధాటికి మెక్సికో పట్టణంలోని ప్రాథమిక పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది.

నాలుగు అంతస్థుల భవనంలో ప్రైవేట్ స్కూల్ నడుస్తోంది. భూకంపం ధాటికి ఈ భవనం కుప్పకూలింది.దీంతో సుమారు 24 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు చనిపోయారని అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే మెక్సికో ప్రెసిడెంట్ ఎన్రిన్ పెనా నీటో మాత్రం మంగళవారం రాత్రికి 22 మంది చనిపోయారని ప్రకటించారు. అయితే 30 మంది చిన్నారులు ఎనిమిదిమంది పెద్దవాళ్ళ ఆచూకీ లభించలేదని ఆయన ప్రకటించారు.
శిథిలాల కింద రక్షణచర్యలను చేపట్టారు. 1985లో సరిగ్గా సెప్టెంబర్ 19వ, తేదినే మెక్సికోలో భారీ భూకంపం వాటిల్లింది. ఈ భూకంపం సందర్భాన్ని పురస్కరించుకొని మాక్ డ్రిల్ నిర్వహించిన కొద్దిసేపటికే ఈ భూకంపం వాటిల్లడం గమనార్హం.












Click it and Unblock the Notifications