రోడ్డు ప్రమాదంలో 30 మంది దుర్మరణం

అబూజా: ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును డీకొనడంతో 30 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన నైజీరియాలో జరిగింది. గమ్యం చేరుకునే సమయంలోనే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సోమవారం లావోస్ నగరం నుండి అబూజాకు బస్సు బయలుదేరింది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మార్గం మద్యలో కొగీ రాష్ట్రంలోని లొకొజా - అబూజా జాతీయ రహదారిలో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొట్టింది.

30 people dead in Nigeria road accident

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అందరికి గాయాలైనాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితులను ఆంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరు డ్రైవర్లు వాహనాలను వేగంగా ,నిర్లక్ష్యంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని ఫెడరల్ రోడ్డు సేఫ్టీ కమిషన్ తెలిపింది. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని కేసు దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+