ఆ మసీదు క్లీనింగ్ కోసం వాడేది నీళ్లు కాదు.. రోజూ 30 వేల లీటర్ల పెర్‌ఫ్యూమ్
Madinah Masjid: సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత మదీనా మసీదును సందర్శించే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అధిక సంఖ్యలో సందర్శించే మసీదుల్లో రెండో స్థానంలో ఉంటోంది మదీనా. హజ్, ఉమ్రా యాత్రల సందర్భంగా మక్కా, మదీనాలను పెద్ద సంఖ్యలో సందర్శిస్తోన్నారు భక్తులు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ జంట మసీదులను దర్శించుకుంటోన్నారు. లక్షలాది మంది ఒకేచోట గుమికూడి, ప్రార్థనల్లో పాల్గొనే పవిత్ర ప్రదేశం కావడం వల్ల ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మసీదులో ప్రార్థనల సందర్భంగా వినియోగించే రగ్గులు, ఫ్లోర్‌ను క్లీన్ చేయడానికి నీళ్లకు బదులుగా ఏకంగా పెర్‌ఫ్యూమ్‌ను వినియోగిస్తోంది.

దీనికోసం ప్రతీరోజూ 30,000 లీటర్ల మేర పెర్‌ఫ్యూమ్‌ను ఉపయోగిస్తోంది. 115 మెట్రిక్ టన్నుల పెర్‌ఫ్యూమ్‌తో రగ్గులను స్టెరిలైజేషన్ చేయిస్తోన్నామని, మరో 110 మెట్రిక్ టన్నుల సెంట్‌ను ఫ్లోర్‌ను క్లీన్ చేయడానికి వాడుతున్నామని మక్కా- మదీనా మసీదుల పరిరక్షణ కమిటీ జనరల్ అథారిటీ డిప్యూటీ చీఫ్ ఫౌజీ అల్ హుజైలీ తెలిపారు.
వేర్వేరు దేశాల నుంచి వచ్చే లక్షలాది మంది ఒకేచోటికి చేరి ప్రార్థనల్లో పాల్గొనే ప్రదేశం కావడం వల్ల వైరస్ గానీ, క్రిములు గానీ, ఇన్‌ఫెక్షన్లు గానీ సోకకుండా ఉండటానికే పెర్‌ఫ్యూమ్‌ను వినియోగిస్తోన్నట్లు హుజైలీ చెప్పారు. రగ్గుల స్టెరిలైజేషన్, ఫ్లోర్ క్లీనింగ్ కోసం 600లకు పైగా పరికరాలను వాడుతున్నామని, సుశిక్షితులపైన కార్మికులు ప్రతి నిమిషం.. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారని అన్నారు.
డిసెంబర్ చివరి వారంలో మక్కా, మదీనా మసీదులను సందర్శించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారం రోజుల వ్యవధిలో సుమారు 5.2 మిలియన్ల మంది ముస్లింలు ఈ జంట మసీదులను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. విదేశాల నుంచి 10 మిలియన్ల మంది ముస్లింలు ఉమ్రా యాత్రగా సౌదీ అరేబియాకు తరలివెళ్లారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications